అడవుల పరిరక్షణపై దృష్టి

  రంగంలోకి పోలీసులు టింబర్, సామిల్‌లలో తనిఖీలు కలప స్మగ్లర్ల గుండెల్లో గుబులు మన తెలంగాణ / ఆదిలాబాద్: అడవుల సంరక్షణ కోసం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ కలప స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అనుమానిత వ్యక్తులను అ దుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లాలోని 18 మండల ప రిధిలో ఉన్న 7 సామిల్లులు, […]

 

రంగంలోకి పోలీసులు
టింబర్, సామిల్‌లలో తనిఖీలు
కలప స్మగ్లర్ల గుండెల్లో గుబులు

మన తెలంగాణ / ఆదిలాబాద్: అడవుల సంరక్షణ కోసం సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. అటవీ శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ కలప స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అనుమానిత వ్యక్తులను అ దుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లాలోని 18 మండల ప రిధిలో ఉన్న 7 సామిల్లులు, 25 టింబర్ డిపోలలో తనిఖీలు ని ర్వహిస్తున్నారు. అక్కడ రికార్డులను పరిశీలిస్తూ కలప వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక ముందు జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి ఒక్క పుల్ల కూడా అక్రమ రవాణ కాకుండా జిల్లా ఎస్పీ వి ష్ణు ఎస్ వారియర్ సాయుధ పోలీసులను అటవీ శాఖ అ ధికారులకు తోడుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. అటవీ శాఖ అధికారుల నివేదికల ప్ర కారం జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి కలప రవాణ అధికంగా జరుగుతుంది.

ఈ ప్రాంతాల్లో అధిక శాతం కలప చెట్ల నరికివేత జరుగుతుందని తెలిసింది. కలప స్మగ్లర్లకు అటవీ శాఖ అండతోనే విచ్చవిచ్చల విడిగా నరికివేసి కలప రవాణ చేశారనే ఆరోపణలున్నాయి. కలప పట్టుకున్న ప్రతిసారి వాహనం, కలప మాత్రమే దొ రుకు తున్నాయి. రవాణ చేస్తున్న వారి వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడనే సామెతకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు వ్యవహారం ఉందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అడవుల సంక్షరణ కోసం తీసుకున్న నిర్ణయంతో పో లీసులు రంగంలోకి దిగారు. కలప స్మగ్లర్లపై నిఘా పెట్టి రవాణ జ రగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాలు వ చ్చిన వెంటనే జిల్లా ఎస్పీ పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్‌తో అనుమతి తీసుకుని సిరికొండ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్‌పై పీడీ యాక్టు విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

జిల్లాలోనే ఇది తొలి పీడీ యాక్టు కేసు కాగా, సామిల్, టింబర్ డిపో య జమనులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అక్రమ కలప వినియోగిస్తే పీడీ యాక్డులకు వెనకాడబోమని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ రావ్‌లు హెచ్చరికలు జారీ చేశారు. సామిల్, టింబర్ డి పోల యజమానులు సైతం అక్రమ కలపను విని యో గించ బోమని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద ఏమైనా స మాచారం ఉంటే నేరుగా పోలీసులకు తెలియచేస్తామని చె బు తు న్నారు. ఇక జిల్లాలో అక్రమ కలప రవాణ మాటే వినబడదని అం టున్నారు. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాల పరిధిలో డీఎఫ్‌వో ప్రభాకర్, ఆదిలాబాద్, ఉట్నూర్ డీఎస్పీలు నర్సింహా రెడ్డి, వెంకటేష్‌లు సమావేశాలు నిర్వహిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తొలుత మర్యాద పూర్వకంగా చెబుతున్నామని తరువాత నేరుగా పీడీ యాక్టు పెట్టి సంవత్సరం కాలం పాటు జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే కార్పెంటర్లు, దుగడ వినియోగిస్తున్న వారితో సమావేశం నిర్వహించి అక్రమ కలప రవాణాలో సహకరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. దీంతోపాటు కర్ర కోత మిషన్లు కలిగి ఉన్న వారిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి చర్యలతో జిల్లాలో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టే దిశగా చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తాయని అంటున్నారు.

Police focus on Wood smuggling in forest areas

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: