కరీంనగర్ జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు

  నేటి నుండి 10 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు ఉత్తమ డ్రైవర్లకు సన్మానం టి.ఎస్.ఆర్.టి.సి రీజియనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ కరీంనగర్: ఫిబ్రవరి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు టి.ఎస్.ఆర్.టి.సి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించబోతున్నట్టు కరీంనగర్ రీజియనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ రోడ్డు భద్రతా వారోత్సవాలలో నిర్వహించబోయే కార్యక్రమాలను తెలియజేశారు. మొదటి రోజు ప్రతి డిపోలో ప్రముఖ వ్యక్తులతో […]

 

నేటి నుండి 10 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు
ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
టి.ఎస్.ఆర్.టి.సి రీజియనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్

కరీంనగర్: ఫిబ్రవరి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు టి.ఎస్.ఆర్.టి.సి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించబోతున్నట్టు కరీంనగర్ రీజియనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ రోడ్డు భద్రతా వారోత్సవాలలో నిర్వహించబోయే కార్యక్రమాలను తెలియజేశారు. మొదటి రోజు ప్రతి డిపోలో ప్రముఖ వ్యక్తులతో కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రారంభ వేడుకలో అధిక సంఖ్యలో డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. రెండవ రోజు మెయింటెనెన్స్ డే నిర్వహిస్తారు. అన్ని డిపోలలో సురక్షిత ప్రయాణానికి సంబంధించిన విషయాలను గురించి నిశితంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. ఉత్తమ మెకానిక్, హెల్పర్స్, శ్రామిక్స్‌ను సన్మానిస్తారు. 6వ తేదీన సంబంధిత వైద్యాధికారితో అన్ని డిపోలలో డ్రైవర్లకు పీరియాడికల్ మెడికల్ ఎగ్గామినేషన్ పూర్తి చేయిస్తారు. 7వ తేదీన ఫ్యామిలీ కౌన్సిలింగ్ డే నిర్వహించి ప్రమాదాల నివారణకు కుటుంబసభ్యుల సమక్షంలో డ్రైవర్లతో సమీక్షించడం జరుగుతుంది.

8వ తేదీన శిక్షణా దినము ఉంటుంది తరుచు ప్రమాదాలు సహా డ్యామేజీలు చేస్తున్న డ్రైవర్లకు జోనల్‌ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ ఇప్పించడం జరుగుతోంది. 9వ తేదీన సత్కార దినం నిర్వహించి ఇందులో రీజయన్ సహా డిపోల స్థాయిలలో ప్రమాద రహీత సర్వీసు గల డ్రైవర్‌లను నగదు పురస్కారాలతో సత్కరిస్తారు. 10వ తేదీన వైభవంగా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుంది. కరీంనగర్ రీజియన్‌లో 10 డిపోలలో 878 బస్సులు ఉన్నాయి. ఇందులో 666 బస్సులు ఆర్టీసికి సంబంధించినవి కాగా మిగితా 212 అద్దె బస్సులన్నాయి. కరీంనగర్ రీజియన్‌లో ప్రస్తుతం 1506 మంది డ్రైవర్లు ఉండగా రోజు సరాసరి 3.55 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 6 లక్షల మంది ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేర వేస్తూ రూ.104.49 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ మాసాంతానికి రూ.35133.47 లక్షల ఆదాయం ఆర్జించగా రూ.37672.06 లక్షల ఖర్చుతో నికరంగా రూ.2538.56 లక్షల నష్టంలో ఉన్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతుండగా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కరీంనగర్ రీజియనల్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ కోరారు.

సన్మానానికి ఎంపికైనా ఉత్తమ డ్రైవర్లు: 
రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని విధులను సక్రమంగా నిర్వహించిన పలువురు ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేయనున్నట్లు తెలిజేసి మూడు కేటగిరిలలో వారిని ఎంపిక చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పేర్కొంటూ వారి వివరాలను అందజేశారు. రాష్ట్రస్థాయికి ఎ.కృష్ణ, రీజియన్‌స్థాయిలో పి.హెచ్‌రావు, పి.మల్లేశం, ఎ.దరాజ్‌ఖాన్, డిపో స్థాయిలో పి.సత్తయ్య, ఎం.సత్తయ్య, ఎస్.సమ్మయ్య, ఎం.రాములు, కె.ఎస్.రావు, ఎం.వి.రెడ్డి, ఎం.వెంకటయ్య, బి.ఆర్.చందర్, జె.దేవయ్య, కె.ఎన్.ప్రసాద్, ఎ.శంకర్, జె.కె.రెడ్డి, ఎం.డి.కె.ఫరీదుద్దీన్, బి.ఆర్.పతి, ఎస్.రాజేందర్, కె.గంగరాజం, సి.ఆశోక్‌రావు, ఎస్.డి.ఖలీల్, జె.డి.నాయక్, ఎస్.వి.ఆర్.రెడ్డి, ఎ.పి.కుమార్, వై.నర్సయ్య, పి.ఎస్.రెడ్డి, బి.మల్లేశం, సి.హెచ్.ఎ.రావు, యం.రాజయ్య, పి.ఆర్.రావు, ఎన్.ఎస్.రావు, ఎస్.శంకర్, బి.చంద్రయ్యలను ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలలో ఎంపిక చేసి సన్మానించబోతున్నట్లు ఆయన వివరించారు.

Road Safety Weeks in Karimnagar District

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: