విలేకరి లింగం కుటుంబానికి అండగా ఉంటాం: క్రాంతి కిరణ్

ఎంఎల్ఎ  క్రాంతికిరణ్, టియుడబ్ల్యుజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శి విరాహత్ ఆలీ   మన తెలంగాణ/టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండల ఆంధ్రజ్యోతి విలేకరి పిండి లింగం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. గురువారం ఆయన స్వగ్రామమైన టేక్మాల్‌లో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టియుడబ్ల్యుజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శి విరాహత్‌ఆలీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే […]

ఎంఎల్ఎ  క్రాంతికిరణ్, టియుడబ్ల్యుజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శి విరాహత్ ఆలీ

 

మన తెలంగాణ/టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండల ఆంధ్రజ్యోతి విలేకరి పిండి లింగం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. గురువారం ఆయన స్వగ్రామమైన టేక్మాల్‌లో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టియుడబ్ల్యుజె (ఐజెయు) ప్రధాన కార్యదర్శి విరాహత్‌ఆలీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి కుటుంబానికి అండగా ఉంటూ ఆదుకుంటానని తెలిపారు. విరాహత్‌ఆలీ మాట్లాడుతూ.. టియుడబ్ల్యుజె (ఐజెయు) యూనియన్ నుండి ఎలాంటి సహకారం చేస్తామని, త్వరలో కుటుంబాన్ని యూనియన్ తరపున ఆదుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంత్యక్రియల్లో టియుడబ్ల్యుజె(ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి ఫైజల్ అహమ్మద్, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి మిన్‌పూర్ శ్రీనివాస్, జిల్లా నాయకులు శంకర్, యాదుల్‌చారి, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, నాగరాజు, సుధాకర్, భూమయ్య, యాదగిరి, ఆనంద్, రాజశేఖర్, సంజీవ్, శ్రీనివాస్, మధు, అశోక్, వీరప్ప, సిద్దయ్య తదితరులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

 

MLA Kranti Kiran Tribes to Journalist Lingam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: