మహిళా సంఘాలకు తేనె తయారీ పై అవగాహన

మన తెలంగాణ/రాజంపేట్ : కామారెడ్డి జిల్లా  రాజంపేట్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనె తయారీ శిక్షణ తరగతులను సోమవారం ఎపిఎం సాయిలు సిబ్బందితో పరిశీలించారు. మహిళలు సంఘాల ద్వారా అభివృద్ధిబాటలో నడవాలని ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే స్వయంశక్తితో ఎదుగుతారని అన్నారు. కొండాపూర్ గ్రామంలో అవగాహన కల్పించిన విధంగా రాజంపేట్‌లో సైతం అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తేనె టీగల పెంపకం లాభదాయకమైన పరిశ్రమ మన రాష్ట్రంలో, దేశంలో రెండు జాతులకు […]

మన తెలంగాణ/రాజంపేట్ : కామారెడ్డి జిల్లా  రాజంపేట్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనె తయారీ శిక్షణ తరగతులను సోమవారం ఎపిఎం సాయిలు సిబ్బందితో పరిశీలించారు. మహిళలు సంఘాల ద్వారా అభివృద్ధిబాటలో నడవాలని ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే స్వయంశక్తితో ఎదుగుతారని అన్నారు. కొండాపూర్ గ్రామంలో అవగాహన కల్పించిన విధంగా రాజంపేట్‌లో సైతం అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తేనె టీగల పెంపకం లాభదాయకమైన పరిశ్రమ మన రాష్ట్రంలో, దేశంలో రెండు జాతులకు సంబంధించిన తేనె టీగలు అందుబాటులో ఉన్నాయని, ఖర్చులు తక్కువగా ఉంటాయని, కొంచెం శ్రమపడితే విజయం మనవైపే ఉంటుందని, దీని ద్వారా ఆలోచనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరముందన్నారు. రాజంపేట్ మండలంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరింత సత్ఫలితాల కోసం మహిళలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు, మహిళా సంఘం అధ్యక్షురాలు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: