దేశం తర్వాతే కుటుంబం

  ఆమె అందరిలాంటి సాధారణ తెలుగమ్మాయి. చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం మీద మక్కువతో నేర్చుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండేది. కాని ఈనాడు ఆ అమ్మాయే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రప్రథమంగా 144 మంది పురుష జవాన్ల బృందాన్ని ముందుండి నడిపించబోతోంది. సంప్రదాయ నృత్యం, సంగీతం, చదువు, కుటుంబమే తన ప్రపంచంగా గడిపిన ఈ అమ్మాయి పొడుగాటి జుట్టుని కత్తిరించుకుని, నాట్య ముద్రలు పట్టిన చేతులతో రైఫిల్ పట్టి దేశరక్షణే లక్ష్యంగా […]

 

ఆమె అందరిలాంటి సాధారణ తెలుగమ్మాయి. చిన్నప్పటి నుండి సంగీతం, నాట్యం మీద మక్కువతో నేర్చుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండేది. కాని ఈనాడు ఆ అమ్మాయే నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రప్రథమంగా 144 మంది పురుష జవాన్ల బృందాన్ని ముందుండి నడిపించబోతోంది. సంప్రదాయ నృత్యం, సంగీతం, చదువు, కుటుంబమే తన ప్రపంచంగా గడిపిన ఈ అమ్మాయి పొడుగాటి జుట్టుని కత్తిరించుకుని, నాట్య ముద్రలు పట్టిన చేతులతో రైఫిల్ పట్టి దేశరక్షణే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆమే హైదరాబాదుకు చెందిన లెఫ్టినెంట్ భావనా కస్తూరి.

భామనే సత్యభామనే అంటూ పొడుగాటి జడను వయ్యారంగా తిప్పుతూ నాట్యం చేస్తూ దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన భావన తను సైన్యం వైపు వస్తానని అస్సలనుకోలేదు. భావనకు శిక్షణ పూర్తయిన వెంటనే కార్గిల్‌లో పోస్టింగ్ ఇచ్చారు.

భారతీయ సైన్యంలోని ‘ఆర్మీ సర్వీస్ కారప్స్’ అనేది సైన్యంలో ఓ విభాగం. 257 ఏళ్ల క్రితం బ్రిటీషువాళ్లు ప్రారంభించిన ఈ రెజిమెంట్ భారతీయ సైన్యంలోని అతి పురాతనమైనది. ఈ విభాగం భారత సైన్యానికి లాజిస్టిక్స్ సహకారం అందిస్తుంది. సైన్యంలో ఆర్మీ సర్వీస్ కారప్స్‌లో ఆఫీసర్‌గా పని చేస్తోన్న భావన గణతంత్ర దినోత్సవంలో పాల్గొంటున్న ఈ విభాగపు బృందాన్ని నాయకత్వం వహిస్తోన్న తొలి మహిళ.

హైదరాబాదులో పుట్టి పెరిగిన భావన వాళ్లది సంప్రదాయ కుటుంబం. తండ్రి సీసీఎంబీ ఉద్యోగి. తల్లి స్టెనోగ్రాఫర్. చిన్నప్పటి నుండి తనకు నాట్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. సాధన చేయడం, ప్రదర్శనలు ఇవ్వడమే తన ప్రపంచంగా బతికింది. చదువుతో పాటు ఈ రెండింటిలోనే తన భవిష్యత్తును ఊహించుకుంది భావన. అయితే

చదువుకుంటున్నప్పుడు సైన్యం గురించి విన్న భావన సైన్యంలో చేరాలనుకుంది. అప్పటికే డిగ్రీలో తను ఎన్‌సీసీలో చేరింది. సైన్యంలో చేరడానికి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికలు జరుగుతాయని తెలుసుకుంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా కొన్ని వేలమంది ఈ పరీక్షలు రాసినా అవకాశం మాత్రం నలుగురికే వస్తుందని తెలుసుకున్న ఆమె… ఆ పరీక్షలో అర్హత సాధించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అప్పటికే డిగ్రీ పూర్తిచేసిన భావన ఓ వైపు ఆ పరీక్షలకు సిద్ధమవుతూనే… మరోవైపు సమయం వృథా కాకుండా ఉస్మానియాలో ఎంఎస్సీ మైక్రోబయాలజీలో చేరింది. మొదటిసారి ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసింది. అవకాశం వస్తుందని అనుకుంది. కానీ రాలేదు. మరో రెండుసార్లు ప్రయత్నించినా సాధించలేకపోయింది. అయినా పట్టు వదల్లేదు. నాలుగోసారి ప్రయత్నించింది. ఈసారి పలు ఇంటర్వ్యూలు, వడపోతల అనంతరం నాలుగోసారి, నాలుగో అమ్మాయిగా అవకాశం అందుకుంది. అలా చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ’ (ఓటీఏ)లో శిక్షణకు అర్హత సాధించింది.

భావనకు సైన్యంలో అవకాశం వచ్చిందని తెలుసుకున్నవారు సంతోషించలేదు. ‘ఆర్మీ శిక్షణ అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆడపిల్లవి. నీ వల్ల కాదు…’ అని కొందరంటే… ‘చక్కగా నాట్యం నేర్చుకున్నావ్. సంగీతం కూడా వచ్చు. ప్రయత్నిస్తే ఐటీ ఉద్యోగం వస్తుంది. భవిష్యత్తు బాగుంటుంది. పెళ్లి చేసుకుని హాయిగా స్థిరపడక ఇంత కష్టం అవసరమా’ అని మరికొందరు అన్నారు. కాని ఎవరెన్ని చెప్పినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకే సిద్ధమైంది. శిక్షణ కోసం అప్పటివరకూ ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని కత్తిరించుకోవాల్సి వచ్చింది. 2015లో సైనికురాలిగా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది.

అప్పుడే ఆమెకు అసలు సవాళ్లు ఎదురయ్యాయి. శిక్షణలో భాగంగా కఠినమైన పరీక్షలు తప్పలేదు. ‘ఒక్క క్షణం ఖాళీ దొరికేది కాదు. ఒక్కోసారి పరుగెడుతున్నప్పుడు కాళ్లు కదపలేని స్థితిలో కూర్చుండిపోయేది. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నా మరో పని ఉండేది. మొదట్లో మనసూ, శరీరం రెండూ సహకరించేవి కావు. శరీరం పుండులా మారిపోయింది. అలసిపోయినా నిద్రపట్టేది కాదు. గుర్రపుస్వారీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఈత, రాకెట్ లాంచింగ్…ఒకటేమిటి ఎన్నో ఉండేవి. ఓసారి 20 కిలోల బరువైన బ్యాగును భుజాన వేసుకుని నలభై కిలోమీటర్లు పరుగెత్తాలని చెప్పారు. అదీ రాత్రంతా పరుగెత్తి తెల్లారేసరికల్లా చేరుకోవాలి. వాళ్ల బ్యాచ్‌లో మొత్తం 250 మంది ఉంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 30. మొదట సందేహించినా, ఒకరు వెనకడుగు వేసినా…మరొకరు ప్రోత్సహించుకుంటూ పరుగెత్తారు. మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరని నిరూపించారు.
అలా శిక్షణలో భాగంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా అన్నింటినీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించింది భావన. ముందు తన ఇంట్లో ఓ పట్టాన నిద్రలేచేది కాదు. ఇప్పుడు శిక్షణలో భాగంగా నాలుగ్గంటలకే లేచి పరేడ్, పరుగు మొదలైనవి అబ్బాయిలతో సమానంగా చాలా చేయాలి. ఒక్కోసారి చేయలేకపోయినా తన లక్ష్యం గుర్తొచ్చినప్పుడల్లా కసి పుట్టేది.

ఆ కసితోనే శ్రమించి రోప్ పుషింగ్, ఫైరింగ్ ఇలా చాలా విభాగాల్లో ముందంజలో ఉంటూ, శిక్షణ పూర్తయ్యేసరికి అకాడమీలో టాపర్‌గా నిలిచింది. భామనే సత్యభామనే అంటూ పొడుగాటి జడను వయ్యారంగా తిప్పుతూ నాట్యం చేస్తూ దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన భావన తను సైన్యం వైపు వస్తానని అస్సలనుకోలేదు. భావనకు శిక్షణ పూర్తయిన వెంటనే కార్గిల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడామెకు మేజర్ పద్మపాణి ఆచార్య గుర్తొచ్చారు.

ఒక్క క్షణం భయం అనిపించినా… ఆయన వీర మరణం ఎంతమందిలో దేశభక్తి రగిలించిందో గుర్తు చేసుకుని మహిళా జవానుగా భరతమాతకు సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని సంతోషంగా చేరింది. దేశం కోసం నిస్వార్థసేవ చేయాలని, తన దేశం కోసం చనిపోయినా ఆనందమేనని, దేశం తరువాతే కుటుంబం అని ఆ క్షణానే నిర్ణయించుకుంది భావన.

“ఇప్పుడు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. సాధారణంగా మహిళలకు నాయకత్వం వహించే అవకాశం రాదు. ఆరునెలల క్రితం మమ్మల్ని బెంగళూరు రమ్మన్నారు. అక్కడ ఎంపికలు జరిగాయి. గణతంత్ర దినోత్వం పెరేడ్‌లో సైనిక బృందానికి నాయకత్వం వహిస్తానని అనుకోలేదు. శిక్షణ మొదలైంది. పెరేడ్, డ్రిల్ ఇలా చాలా జరిగాయి. డిసెంబరు చివరివారంలో నన్ను కంటింజెంట్ కమాండర్‌గా ఎంపిక చేస్తూ నాయకత్వం వహించమన్నారు’ అని చెబుతుంది భావన.

144 మంది జవాన్లు భావన నాయకత్వంలో రాజ్‌పథ్‌లో నేడు మార్చింగ్ చేయబో తోంది. సాయుధ దళాల సుప్రీమ్ కమాండర్‌కు రెండున్నరేళ్ల క్రితమే సైన్యంలో చేరిన తను కమాండ్ ఇచ్చినప్పుడు అతను నా సెల్యూట్ తీసుకునే దృశ్యం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని అంటోంది భావన కస్తూరి. ఆమె భర్త కూడా సైన్యంలో డాక్టరుగా పని చేస్తున్నారు. భావన శ్రమ, పట్టుదల మిగతా ఆడపిల్లలకు ఆదర్శంగా నిలవాలి.

Lieutenant Bhavana Kasturi leader to Army Service Corps

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: