ఒంటరిగా ఐదు రోజులు అడవిలోనే…

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది దీపావళి పండుగ కాలంలో తాను ఐదు రోజులు అడవిలో ఒంటరి జీవితాన్ని గడుపుతానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. “ది హ్యూమన్స్ ఆఫ్ బాంబే” ఫేస్‌బుక్ పేజ్‌కి ఇచ్చిన మూడవ భాగం ఇంటర్వూలో ఆయన తన జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను ఆవిష్కరించారు. “ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఐదు రోజులు ఏదో ఒక మారుమూల ఆడవిలో-కేవలం మంచి నీరు, మనుషులెవరూ ఉండని ప్రదేశానికి వెళ్లిపోతాను. నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను” […]

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది దీపావళి పండుగ కాలంలో తాను ఐదు రోజులు అడవిలో ఒంటరి జీవితాన్ని గడుపుతానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. “ది హ్యూమన్స్ ఆఫ్ బాంబే” ఫేస్‌బుక్ పేజ్‌కి ఇచ్చిన మూడవ భాగం ఇంటర్వూలో ఆయన తన జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను ఆవిష్కరించారు. “ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఐదు రోజులు ఏదో ఒక మారుమూల ఆడవిలో-కేవలం మంచి నీరు, మనుషులెవరూ ఉండని ప్రదేశానికి వెళ్లిపోతాను. నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను” అని మోడీ చెప్పారు.

“పరుగులు తీసే జీవితం నుంచి, నిరంతరం తీరికలేని బతుకు పోరాటం నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకోండి..ఆత్మపరిశీలన చేసుకోండని అందుకే అందరికీ, ముఖ్యంగా నా యువజన మిత్రులకు చెబుతుంటాను.. అలా చేయడం వల్ల మీ ఆలోచనా ధోరణి మారుతుంది. మిమల్ని గురించి మీరు బాగా తెలుసుకుంటారు” అని మోడీ సలహా ఇచ్చారు. ఇదివరకు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూలలో తన బాల్య జీవితం, ఆర్‌ఎస్‌ఎస్ తనను ఎందుకు ఆకర్షించింది, 17ఏళ్ల వయసు ఉన్నప్పుడు తాను హిమాలయాలలో రెండేళ్లు గడిపిన విషయాల గురించి మోడీ వివరించారు. అయితే, మంగళవారం ప్రచురించిన పోస్ట్‌లో ఆయన తాను హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారిందన్న విషయాల గురించి వెల్లడించారు.

“హిమాలయాల నుంచి తిరిగివచ్చిన తర్వాత ఇతరుల కోసమే నా ఈ జీవితం అన్న సత్యాన్ని గ్రహించాను. కొద్ది కాలానికే అహ్మదాబాద్ వెళ్లిపోయాను. ఒక పెద్ద నగరంలో కాలుపెట్టడం అదే నాకు మొదటిసారి..మా బంధువు క్యాంటీన్‌లో అప్పుడప్పుడు పనిచేస్తూ సాయపడేవాణ్ణి. కొద్దిరోజుల్లోనే ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తి స్థాయి ప్రచారక్‌గా మారిపోయాను. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను కలుసుకునే అవకాశం అక్కడే నాకు లభించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం, సహచరులకు టీ, ఆహారం తయారు చేయడం, వంట పాత్రలు కడగడం వంటి పనులను మేము చేస్తుండేవాళ్లం. క్షణం తీరికలేని పనులు ఉన్నప్పటికీ హిమాలయాలలో నేను సంపాదించిన “మానసిక శక్తి”ని వృథాగా పోనివ్వదలచుకోలేదు. అప్పటి నుంచి ప్రతి ఏటా కొన్ని రోజులు నాకోసం కేటాయించుకుని నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుని, సమతుల్య జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను” అని మోడీ తెలిపారు.

“దీపావళి సమయంలో నేను ఐదు రోజులు ఎక్కడ ఉంటానో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఏదో ఒక మారుమూల అడవిలో, కేవలం మంచినీరు, మనుషులెవరూ ఉండని చోటికి వెళ్లిపోతాను. ఐదురోజులకు సరిపడ ఆహారాన్ని నా వెంట ఉంచుకుంటాను. రేడియోలు కాని వార్తాపత్రికలు కాని అక్కడ ఉండవు..ఆ రోజుల్లో టివి కాని ఇంటర్నెట్ సౌకర్యం కాని ఎటూ లేవు” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

“అక్కడ గడిపే ఆ కాలమే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక శక్తిని ప్రసాదిస్తోంది. ఎవరిని కలుసుకోబోతున్నావని కొందరు సన్నిహితులు నన్ను తరచూ అడుగుతుంటారు… ‘నన్ను నేను కలుసుకోవడానికి వెళుతున్నాను’ అని చెబుతుంటాను” అని ప్రధాని మోడీ వెల్లడించారు.

PM Modi used to spend in Forests every year

Related Stories: