బాప్‌రే బాప్‌.. ఆవు కోసం ఎంత రిస్క్..!(వీడియో)

జునాగఢ్: ఆవును కాపాడడం కోసం ఓ ట్రక్కు డ్రైవర్ చేసిన స్టంట్ సినిమాను సీన్ ను తలపించింది. కళ్లు చెదిరే ఈ స్టంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో కొద్దిలో ఆవు ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ లో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఆవు అటువైపు నుంచి ట్రక్కు రావడం గమనించి ఉన్నట్టుండి వెనక్కి పరిగెత్తితింది. అప్పటికే ట్రక్కు చాలా దగ్గరికి వచ్చేసింది.  కానీ,  ట్రక్కు […]

జునాగఢ్: ఆవును కాపాడడం కోసం ఓ ట్రక్కు డ్రైవర్ చేసిన స్టంట్ సినిమాను సీన్ ను తలపించింది. కళ్లు చెదిరే ఈ స్టంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో కొద్దిలో ఆవు ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ లో చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఆవు అటువైపు నుంచి ట్రక్కు రావడం గమనించి ఉన్నట్టుండి వెనక్కి పరిగెత్తితింది. అప్పటికే ట్రక్కు చాలా దగ్గరికి వచ్చేసింది.  కానీ,  ట్రక్కు డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేయడంతో వాహనం సినిమాల్లోని స్టంట్ లాగా ఒక్కసారిగా 180 డిగ్రీలు టర్న్ అయింది. మానవత్వంతో ఆలోచించిన డ్రైవర్ ఆవు కోసం పెద్ద రిస్కే చేశాడు. ఈ ఘటనకు సంబధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో నెటిజన్లు డ్రైవర్ సమయస్పూర్తిని కొనియాడుతున్నారు. బాప్‌రే బాప్‌.. ఆవును కాపాడటం కోసం డ్రైవర్ ఎంత రిస్క్ చేశాడని మెచ్చుకుంటున్నారు.

Cow Being Saved by a Truck Driver in Junagarh

Related Stories: