విచిత్ర వ్యాధి: చేతుల్లో మొలుస్తున్న చెట్లు..

  ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్ బజందర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఎవరికీ రానటువంటి విచిత్ర వ్యాధితో బాధపడుతున్నాడు. తనకొచ్చిన ఈ అరుదైన వ్యాధితో బంగ్లాదేశ్ ట్రీ మ్యాన్‌గా అబ్దుల్ బజందర్ ఫేమస్ అయ్యిన సంగతి తెలిసిందే. 2016 నుంచి  అతను ఈ సమస్యతో బాధపడుతున్నాడు. శరీరంపై చెట్లలా పొడుచుకొస్తున్న దద్దుర్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యపై అనేక పరిశోధనలు చేసిన డాక్టర్లు అతను ట్రీ మ్యాన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించింది. దాదాపు 25 శస్త్ర చికిత్సలు […]

 

ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్ బజందర్ అనే వ్యక్తి ప్రపంచంలో ఎవరికీ రానటువంటి విచిత్ర వ్యాధితో బాధపడుతున్నాడు. తనకొచ్చిన ఈ అరుదైన వ్యాధితో బంగ్లాదేశ్ ట్రీ మ్యాన్‌గా అబ్దుల్ బజందర్ ఫేమస్ అయ్యిన సంగతి తెలిసిందే. 2016 నుంచి  అతను ఈ సమస్యతో బాధపడుతున్నాడు. శరీరంపై చెట్లలా పొడుచుకొస్తున్న దద్దుర్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యపై అనేక పరిశోధనలు చేసిన డాక్టర్లు అతను ట్రీ మ్యాన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించింది. దాదాపు 25 శస్త్ర చికిత్సలు చేసి, అతని శరీరంపై పొడుచుకొచ్చిన మొక్కల్లాంటి దద్దుర్లను తొలగించేశారు. అతనికి వ్యాధి తక్కువైందని భావించి ఇంటికి పంపారు. అయితే, అతని శరీరంలో నుంచి మొక్కల్లాంటివి పుట్టుకు రావడం మాత్రం మానలేదు. అతని శరీరంలో మరిన్ని చోట్ల కూడా అలాగే జరుగుతోంది. ఈ సారి అరచేతుల నిండా ఈ చెట్లలాంటివి పుట్టుకొస్తున్నాయి. కాళ్లలోనూ ఇవి పుట్టుకొస్తుడడంతో రిక్షా తొక్కుకు బతికే బజందర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో డాక్టర్లు తాజాగా అతనికి ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో మరోసారి ట్రీట్‌మెంట్ జరుగుతోంది.

 

పరీక్షల అనంతరం బజందర్‌కు మరిన్ని శస్త్రచికిత్సలు చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ వ్యాధి నివారణ కోసం మరిన్ని చికిత్సల కోసం అన్వేషిస్తున్నామని, త్వరలోనే బజందర్‌కు శస్త్ర చికిత్స చేస్తామని డాక్టర్లు చెప్పారు. అతను వింతైన జబ్బుతో బాధపడుతున్నాడని, మరిన్ని సర్జరీలు అవసరమవుతాయని అక్కడి ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ సమంత లాల్‌సేన్ చెప్పారు. బజందర్‌కు భార్య, కూతురు ఉన్నారు. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. అతనికి ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆస్పత్రిలోనూ అతనికి మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. అతడి పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.Bangladesh Tree Man Needs

more surgeries

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: