రేప్ కేసులో స్కూల్ వ్యాన్ డ్రైవర్‌కు జీవిత ఖైదు!

హైదరాబాద్: మైనర్ బాలికను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్‌కు రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తాజాగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. బాల్‌రాజ్ అలియాస్ బాలు అనే యువకుడు హయాత్‌నగర్‌లోని ఓ స్కూల్ బస్‌కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నమ్మబలికి పెళ్లి చేసుకుంటానని రాజేంద్రనగర్‌లోని […]

హైదరాబాద్: మైనర్ బాలికను అపహరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్‌కు రంగారెడ్డి మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తాజాగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. బాల్‌రాజ్ అలియాస్ బాలు అనే యువకుడు హయాత్‌నగర్‌లోని ఓ స్కూల్ బస్‌కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నమ్మబలికి పెళ్లి చేసుకుంటానని రాజేంద్రనగర్‌లోని తన స్నేహితుల రూమ్‌కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడైన బాలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుమారు నాలుగేళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవకారగార శిక్షతో పాటు రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Man Sentenced to Life Imprisonment for Raping Minor Girl

Related Stories: