మల్లాపూర్‌లో పెట్రోల్, డీజిల్ మాఫియా

డ్రైవర్లతో దళారీల బేరం, అక్రమంగా చోరీ చేయడం… రిటెయిలర్లకు విక్రయించడం, క్యాన్‌ల వారీగా డ్రైవర్లకు లేదా ఓనర్లకు చెల్లింపులు ,ట్యాంకర్లు నిలిపే స్థావరాలే చోరీకి అడ్డాలు మన తెలంగాణ/నాచారం: గ్రేటర్ శివారు లో అక్రమంగా పెట్రోల్, డీజిల్ చోరీ చేయడం, అమ్మకాలు జరిపేవారు ఒక మా ఫియా మారారు. తస్కరించిన, దొంగిలించిన పెట్రోల్, డీజిల్‌ను అనుమతిలేని షాపులకు చేరవేయడం ద్వారా రిటేయిల్ విక్రయాలను దళారులు జోరుగా సాగిస్తున్నారు. కొందరు ఏకంగా పరిశ్రమలకు చెందిన పైపులైన్‌లకే సొరంగం తొవ్వి […]
డ్రైవర్లతో దళారీల బేరం, అక్రమంగా చోరీ చేయడం… రిటెయిలర్లకు విక్రయించడం, క్యాన్‌ల వారీగా డ్రైవర్లకు లేదా ఓనర్లకు చెల్లింపులు ,ట్యాంకర్లు నిలిపే స్థావరాలే చోరీకి అడ్డాలు

మన తెలంగాణ/నాచారం: గ్రేటర్ శివారు లో అక్రమంగా పెట్రోల్, డీజిల్ చోరీ చేయడం, అమ్మకాలు జరిపేవారు ఒక మా ఫియా మారారు. తస్కరించిన, దొంగిలించిన పెట్రోల్, డీజిల్‌ను అనుమతిలేని షాపులకు చేరవేయడం ద్వారా రిటేయిల్ విక్రయాలను దళారులు జోరుగా సాగిస్తున్నారు. కొందరు ఏకంగా పరిశ్రమలకు చెందిన పైపులైన్‌లకే సొరంగం తొవ్వి మరీ కన్నం వేస్తే మరికొందరు ఏకంగా బంక్‌లకు వెళ్ళే ట్యాంకర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. కంపెనీల పైపులైన్‌లకు కన్నం వేసే వారి వి షయం పక్కన పెడితే పెట్రోలియం సంస్థల నుంచి నగరంలోని పెట్రోల్ బంక్‌లకు చేరవేసే ట్యాంకర్ల డ్రైవర్లు, ఓనర్లు, దళారీలు క లిసి ఇటు సంస్థలకు, అటు బంక్‌లకు కుచ్చుటోపి పెడుతున్నారు. మరోవైపు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. చోరీచేసిన ఇంధనాలను రిటేయిలర్లకు విక్రయించి లక్షలాదిగా అక్రమాదాయం పొందుతున్నారు. ఈ తరహా(మొదటి పేజీ తరువాయి) వ్యవహారాలకు కేంద్రాలుగా మల్లాపూర్, నాచారంలు అనేది ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడే పెట్రోల్, డీజిల్‌లు కల్తీ చేస్తున్నట్టు, మరోవైపు బల్క్‌గా సేకరించి చట్టవిరుద్దంగా విక్రయాలు జరుపుతున్నారనేది బహిరంగరహాస్యం.

తంతు ఇలా

గ్రేటర్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్‌లో పెట్రోల్ మాఫియా పెట్రోల్, డిజిల్ ఇంధనాలను దొంగతనంగా ట్యాంకర్ల నుంచి చోరిచేసి తమదైన శైలిలో పెట్రోల్ అమ్మకాలు జరుపుకోవడం సాధారణంగా మారిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. మల్లాపూర్ డివిజన్ పరిధిలో దాదాపు 10 ట్యాంకర్ల అడ్డాలు ఉన్నాయి. ఈ అడ్డాల్లో కనీసంగా నలుగురు దళారీలు స్థావరాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇక్కడే ట్యాంకర్లు కొందరు నిలుపుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు నేరుగా డ్రైవర్లు, ఓనర్లను కొందరిని కలిసి అక్రమంగా పెట్రోల్, డీజిల్ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉంటుందని వివరించి నమ్మిస్తారు. దీంతో దళారీలతో చేతులు కలిపిన కొందరు ట్యాంకర్లు, డ్రైవర్లు తమ ట్యాంకర్ల ద్వారా రవాణా చేసే పెట్రోల్, డీజిల్ ఇంధనాలను క్యాన్‌ల రూపంలో అక్రమంగా తీస్తున్నారు. క్యాన్‌ల వారిగా నగదును దళారీలు అందిస్తున్నారని, తీసిన ఈ ఇంధనాలను తమతమ అడ్డాలలోని ముందే ఏర్పాటుచేసుకున్న డ్రమ్ముల్లో నింపి విక్రయాలు చేయడం కొందరైతే, మరికొందరు క్యాన్‌లలో నింపుకున్న వాటిని అలానే నేరుగా రిటైల్ దుకాణాదారులకు చేరవేస్తున్నారు. తద్వారా వచ్చిన ఆదాయంతో కోట్లు గడిస్తున్నారనే ప్రచారమున్నది. ప్రతి లీటర్‌ను మార్కెట్ ధరలకన్నా రూ. 10 నుంచి 15 తక్కువగా చేసి విక్రయాలు చేస్తున్నట్టు ప్రచారమున్నది.

అదుపులో అనుమానితులు..?

గత సోమవారం రోజున పెట్రోల్ ను దోంగతనం చేస్తున్నారనే ప్రచారం స్థానికంగా వైరల్‌గా మారింది. దీంతో కొందరు వారు చోరీచేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. ట్యాంకర్ల వారికి, అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తున్నవారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది. ఈ సమాచారం పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన నాచారం పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

Petrol and Diesel Mafia in Mallapur

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: