ఇద్దరు పిఎన్‌బి ఇడిలపై వేటు

  నీరవ్ కేసులో స్విఫ్ట్ వ్యవస్థ దుర్వినియోగం ఆరోపణలే కారణం న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటుపడింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన కంపెనీలు రూ.14,300 కోట్లు మోసానికి పాల్పపడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇడిలు కెవి బ్రహ్మజీ రావ్, సంజీవ్ శరణ్‌లను విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. విధులను సరిగ్గా నిర్వహించకపోవడం, నియంత్రణ లేని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రుణాల మంజూరు కోసం బ్యాంకులు […]

 

నీరవ్ కేసులో స్విఫ్ట్ వ్యవస్థ దుర్వినియోగం ఆరోపణలే కారణం

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటుపడింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన కంపెనీలు రూ.14,300 కోట్లు మోసానికి పాల్పపడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇడిలు కెవి బ్రహ్మజీ రావ్, సంజీవ్ శరణ్‌లను విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. విధులను సరిగ్గా నిర్వహించకపోవడం, నియంత్రణ లేని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రుణాల మంజూరు కోసం బ్యాంకులు వినియోగించే ఇంతర్జాతీయ మేసేజింగ్ సిస్టమ్ ‘స్విఫ్ట్’లో వీరు దుర్వనియోగానికి పాల్పడ్డారని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎందుకు చర్యలు చేపట్టకూడదో చెప్పాలంటూ ఇద్దరికీ షోకాజ్ నోటీసుకు జారీ చేసిన తర్వాత ఆరు నెలలకు శరణ్, రావ్‌లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే నేషనల్ బ్యాంక్స్ స్కీం 1970 కింద ఒక జాతీయ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లను తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2018 జులైలో శరణ్, బ్రహ్మాజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లో స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని నోటీస్‌లో పేర్కొంది. వారి వివరణలు పరిశీలించాక బ్యాంక్ బోర్డు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని వారిని తొలగించింది. తనపై సిబిఐ కేసును సవాలు చేస్తూ రావ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తొలగింపు కోర్టు ఆదేశాలకు లోబడి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే శరణ్ మే నెలలో రిటైల్ కానున్నారు. కాగా ఈ చర్యను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాగతించింది. కేంద్ర ప్రభుత్వ చర్యను హర్షిస్తున్నామని, అత్యున్నత నిర్వహణ బృందానికి తెలియకుండా ఇంత భారీ స్థాయిలో మోసం జరగడానికి అవకాశం లేదని, ప్రభుత్వం కూడా వారి వాదనలు విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని ఎఐబిఇఎ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు.

Government is removed of PNB two Executives directors

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: