భారత్ బ్రిటన్‌ను దాటేస్తుంది.

  న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్‌ను భారత్ అధిగమించే అవకాశముందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్లుసి నివేదిక పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు వృద్ధిలో పోటాపోటీగా ఉంటూ సరిసమాన స్థాయిలను కల్గి ఉంటున్నాయి. వీటి జనాభా కూడా సమానంగానే ఉంటుంది. అయితే భారత్ ఓ మెట్టు పైకి ఎక్కి తన స్థానాన్ని శాశ్వతం చేసుకునే అవకాశముందని నివేదిక వివరించింది. 2019 సంవత్సరంలో బ్రిటన్ జిడిపి(స్థూల దేశీయ్పత్తి) 1.6 శాతంగా, ఫ్రాన్స్‌కు […]

 

న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్‌ను భారత్ అధిగమించే అవకాశముందని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్లుసి నివేదిక పేర్కొంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు వృద్ధిలో పోటాపోటీగా ఉంటూ సరిసమాన స్థాయిలను కల్గి ఉంటున్నాయి. వీటి జనాభా కూడా సమానంగానే ఉంటుంది. అయితే భారత్ ఓ మెట్టు పైకి ఎక్కి తన స్థానాన్ని శాశ్వతం చేసుకునే అవకాశముందని నివేదిక వివరించింది. 2019 సంవత్సరంలో బ్రిటన్ జిడిపి(స్థూల దేశీయ్పత్తి) 1.6 శాతంగా, ఫ్రాన్స్‌కు 1.7 శాతం, భారత్‌కు జిడిపి 7.6 శాతంగా ఉండనుందని పిడబ్లుసి గ్లోబల్ ఎకానమి వాచ్ రిపోర్ట్ అంచనా వేసింది. 2019లో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్‌ను భారత్ గానీ, ఫ్రాన్స్ గానీ అధిగమించే అవకాశముందని, అంతర్జాతీయంగా బ్రిటన్ స్థానంలో ఐదు నుంచి ఏడుకు పడిపోవచ్చని నివేదిత తెలిపింది. ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం, 2017 ప్రపంచ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఫ్రాన్స్‌ను దాటనుందని తెలిపింది.

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం, చమురు ధరల పెరుగుదల వంటి ఎదురుగాలులు లేనట్టయితే 201920 సంవత్సరంలో భారత్ 7.6 శాతంతో ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేయవచ్చని పిడబ్లుసి పేర్కొంది. భారత్‌లో ఇటీవల చెపట్టిన సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయి. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) వంటి నిర్ణయాల ఫలితాలు వాస్తవ రూపంలోకి వస్తాయని, ఇవి కొత్త ప్రభుత్వానికి దోహదం చేస్తాయని పిడబ్లుసి ప్రతినిధి రాణెన్ బెనర్జీ అన్నారు. పిడబ్లుసి సీనియర్ ఆర్థికవేత్త మైక్ జేక్‌మన్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశం భారత్ అని అన్నారు. భారత్ జనాభా పరంగా, సామర్థ పరంగా ముందుందని, తక్కువ జిడిపి వల్ల సామర్థాన్ని వినియోగించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోటీ పడుతూ సమఉజ్జీలుగా ఉంటున్నాయని, 2018లో బ్రిటన్‌లో వృద్ధి మందగించడం ఫ్రాన్స్‌కు కలిసి వస్తుందని అన్నారు. జు7 దేశాలు దీర్ఘకాల సగటు వృద్ధి రేట్ల కారణంగా 2019లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ఉండనుందని పిడబ్లుసి వెల్లడించింది.

India in Economy Surpasses That Of Great Britain

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: