వేధింపులను రికార్డ్ చెయ్యండి..

  మేడమ్ నా పేరు మోనిక. నేను m.com చదివాను. మా నాన్న గారిది చిన్న బట్టల షాపు. నన్నూ, చెల్లి హారికను బాగా చదివించాలని ఆయన కోరిక. ప్రసుత్తం చెల్లి b.tech రెండవ సంవత్సరం చదువుతుంది. నాది పీ.జీ అయిపోయింది కనుక నాన్న కష్టంలో పాలుపంచుకోవాలని ఆయనకు నా వంతు సహాయం చేయాలని ఒక చార్టెడ్ అకౌటెంట్ వద్ద ఉద్యోగంలో చేరాను. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆఫీసు పనులన్నీ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. నేను […]

 

మేడమ్ నా పేరు మోనిక. నేను m.com చదివాను. మా నాన్న గారిది చిన్న బట్టల షాపు. నన్నూ, చెల్లి హారికను బాగా చదివించాలని ఆయన కోరిక. ప్రసుత్తం చెల్లి b.tech రెండవ సంవత్సరం చదువుతుంది. నాది పీ.జీ అయిపోయింది కనుక నాన్న కష్టంలో పాలుపంచుకోవాలని ఆయనకు నా వంతు సహాయం చేయాలని ఒక చార్టెడ్ అకౌటెంట్ వద్ద ఉద్యోగంలో చేరాను. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆఫీసు పనులన్నీ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. నేను కూడా చాలా సీరియస్‌గా నేర్చుకొని నా ఉద్యోగాన్ని సక్రమంగా చేస్తున్నాను. అమ్మ, నాన్న, చెల్లి అందరూ నేను జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నాకు ఈ మధ్య ఒక సమస్య ఎదురైంది.

అది మా సార్ తమ్ముడి రూపంలో.. అతను ఈ మధ్య మా ఆఫీసుకి వచ్చి, తనకు సంబంధం లేని విషయాలను నన్ను పదే పదే అడిగి, సాయంత్రం వరకూ నా వద్దే వుండి నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. తనతో సినిమాలకు, షికార్లకు రమ్మని నన్ను ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి వేధిస్తున్నాడు. నేను ఈ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక, భరించలేక పోతున్నాను. అమ్మా, నాన్నలతో చెబితే జాబ్ మానేయ మంటారు. మా బాస్‌కి చెబితే వాళ్ళ తమ్ముడి మీద నమ్మకంతో నా మాట నమ్ముతాడో లేదో అని అనుమానంగా వుంది. నేను ఏం చేయాలో దయచేసి సలహా ఇవ్వండి. ఆడవాళ్ళకు ఈ లైంగిక వేధింపులు తప్పవా? వీటికి చట్టపరమైన శిక్షలు ఏమున్నాయి? తెలియజేయండి.

చూడు మోనికా ! నీవు రాసిన ఈ సమస్య వాస్తవానికి నీ ఒక్కదానిదే కాదు. నూటికి 90 శాతం మంది మహిళలు అంటే వేరు, వేరు రంగాల్లో ఉద్యోగం చేసేవారు, విద్యార్థినులు, గృహిణిలు అందరూ వీటిని ఎదుర్కొంటున్నారు. ఈ వేధింపులకు వయస్సుతో సంబంధం లేదు. ఇక నీలాంటి పెళ్ళి కాని పిల్లలు ఉద్యోగానికెళితే చెప్పనక్కర్లేదు. కొందరు వీటిని ఎవరికి చెప్పుకోలేక నరకయాతన పడుతున్న తీరు వర్ణనాతీతం. అందుకే వీటిని అరికట్టడానికి 1964 లోనే లైంగిక వేధింపులు చట్టం తెచ్చారు. దీన్ని 1998లో మరలా ఎమెండ్ చేశారు. రూల్ నెం.3 ప్రకారం లైంగిక వేధింపులను నిషేధించారు. అయితే ఐపిసి సెక్షన్ 34 కింద ఈ వేధింపుల దురుద్దేశాన్ని రుజువు చేయాల్సి వుంటుంది.

స్త్రీలపై లైంగిక వేధింపులకు ఎవ్వరు పాల్పడినా (యజమాని లేదా సహ ఉద్యోగులు) సెక్షన్.6 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష , 25 వేలు జరిమాన ఉంటుంది. నీవు నీ సార్‌కి చెప్తే ఏమంటారో అన్న అనుమానం వదిలిపెట్టు. నీవు సెల్‌ఫోన్ ద్వారా అతను నిన్ను వేధిస్తున్న తీరుని రికార్డు చేసి చూపించు. అలాగే సెక్షన్ 14 ప్రకారం యజమాని ద్వారా కాకుండా మూడో వ్వక్తి ద్వారా వేధింపులకు గురైతే యజమాని ఆ స్త్రీకి సహకరించి అరికట్టాలి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో సెక్షన్ 15 ప్రకారం లైంగిక వేధింపులు దర్యాప్తుకై ప్రత్యేక ఆఫీసర్ల నియామకం వుంది. కనుక ఎవ్వరూ ఈ విషయంలో భయపడకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే నిందితులు చట్టరీత్యా శిక్షింపబడతారు. బయట ప్రపంచంలో ఇలాంటివి జరగక్కుండా షీ టీమ్స్ పని చేస్తున్నాయి. చదువు, టాలెంట్ వున్న నీకు ఈ జాబ్ పోయినా, మరొకటి దొరుకుతుంది. ధైర్యంగా వుండు చట్టం నీకు అండగా వుంటుంది.

                                                                                                       ఎస్. బిటి సుందరి
                                                                                         హైకోర్టు న్యాయవాది, ఫ్యామిలీకౌన్సిలర్
                                                    మీ సమస్యలను features@manatelangana.orgకి పంపగలరు

instructions on sexval harassments

Related Images:

[See image gallery at manatelangana.news]