నవ్వు…నవ్వించు

  నవ్వు ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం “నవ్వు…నవ్వించు..ఆనందంగా జీవించు” అనేది నేటి వైద్యులు చెబుతున్నమాట. నవ్వు ఒక టానిక్. చిరునవ్వుతో ప్రపంచాన్నే జయించవచ్చని మానసిక వేత్తలు అంటారు. మనిషి మోముపై నవ్వు ఒక ఆభరణంగా భావిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ ఉన్న మనిషి అందరినీ ఆకర్షిస్తాడు. నవ్వు ఒక వరం. ఇది ప్రకృతిలో మనిషి ఒక్కడికే లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేటి తరం అసలు నవ్వడం మర్చిపోతున్నారు. పనుల ఒత్తిడి, […]

 

నవ్వు ఒక భోగం

నవ్వించడం ఒక యోగం

నవ్వకపోవడం ఒక రోగం

“నవ్వు…నవ్వించు..ఆనందంగా జీవించు” అనేది నేటి వైద్యులు చెబుతున్నమాట. నవ్వు ఒక టానిక్. చిరునవ్వుతో ప్రపంచాన్నే జయించవచ్చని మానసిక వేత్తలు అంటారు. మనిషి మోముపై నవ్వు ఒక ఆభరణంగా భావిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ ఉన్న మనిషి అందరినీ ఆకర్షిస్తాడు.

నవ్వు ఒక వరం. ఇది ప్రకృతిలో మనిషి ఒక్కడికే లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేటి తరం అసలు నవ్వడం మర్చిపోతున్నారు. పనుల ఒత్తిడి, బిజీ లైఫ్ పేరుతో తీరికగా నవ్వే అవకాశం ఎక్కడుందని అంటున్నారు. అసలు నవ్వి ఎంతకాలం అయిందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. అప్పుడు స్ఫురిస్తుంది. తాము నవ్వి చాలాకాలం అయిందని. తన విషయంలో నవ్వలేకపోయినా ఇతరుల విషయాలు స్ఫురణకు తెచ్చుకుని నవ్వవచ్చు. గాంభీర్యం ఇటీవల ప్రతిఒక్కరూ ప్రదర్శిస్తున్నారు. సీరియస్‌నెస్ ఎందుకు వస్తోందని ప్రశ్నించుకుంటే జీవనశైలి, పోటీతత్వం, సమస్యలు, లక్షాల పరుగులో కొట్టుకుపోతున్న నేటి యువత అసలు నవ్వు అనేది మర్చిపోతున్నారు. సమస్యలు సహజం. వాటిని అధిగమించడం కష్టంతో కూడుకున్న విషయమే. కాని తమకున్న సహజలక్షణమైన నవ్వును మర్చిపోవడం వల్ల మరింత ఒత్తిడికి గురవుతున్నారు.

నవ్వులేకపోవడం కూడా అనారోగ్యమేనని మానసికవేత్తలు చెబుతున్నారు. నవ్వడం ఆరోగ్యానికి ఒక టానిక్‌లాగా పనిచేసింది. జీవితంలో ఆనందాన్ని పంచుతుంది. బాల్యంలో ఆటపాటలతో నవ్వుతూ తుళ్లుతూ గడుపుతారు. యవ్వనం వచ్చేసరికి ఆ నవ్వును మర్చిపోతారు. కౌమారంలో బాధ్యతలు, బంధాలతో నవ్వు తమ సహజ లక్షణమనేది గుర్తుండదు. అప్పుడు ఆరోగ్యంపై దీని ప్రభావం చూపుతుంది. నవ్వు మర్చిపోయిన వ్యక్తుల, జీవితాల్లో…ముఖ్యంగా నడివయసులో అనారోగ్యం వచ్చే అవకాశాలు హెచ్చని ఒక అంచనా.

 

 

స్కూలులో చదివే సమయంలో కేరింతలతో ఉన్న విద్యార్థులు కాలేజీ విద్యకు వచ్చేసరికి గాంభీర్యం నేర్చుకుంటున్నారు. నేటి కార్పొరేట్ యుగంలో ఆటపాటలు లేవు. కేవలం చదువు చదువు. ఒక విధంగా చెప్పాలంటే బాల్యంలో అనుభవించిన నవ్వు పోవడానికి కారణం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కారణమని కొంతమంది అభిప్రాయం. కార్యాలయాల్లోకి వెళ్లి చూస్తే ఎవరికి వారు సీరియస్‌గా పనిచేసుకోవడం కన్పిస్తుంది. పనిచేసుకోవడం తప్పు కాదు. కానీ యాంత్రికంగా చేస్తూండడమే తప్పు. ఏదో కోల్పోయినట్లు ఉండటమే. నవ్వుతూ, పక్కవారిని పలకరిస్తూ, పనిలో ఆనందాన్ని చూడడం మరిచిపోతున్నారు. పనిలో నవ్వుకోల్పోవడం ముఖ్యంగా కార్పొరేట్ సంస్కృతే కారణం. పోటీతత్వం పెరిగి..మనం మాట్లాడితే అవతలి వ్యక్తి మన శక్తియుక్తులను గ్రహిస్తాడనే భయం వల్ల పలకరింపు, నవ్వులు మాయమవుతున్నాయి. మిత్రులే కరువయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. పోటీతత్వం తీవ్రంగా ఉన్నచోట నవ్వు అసలు కనిపించదు. అందుకు ఉదాహరణ..జపాన్ పౌరులు నవ్వడం చాలా తక్కువ. అలాంటి సంఘటన ఎదురైనా చిరునవ్వు నవ్వడమే గగనం.

మానవ వనరుల వినియోగంలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను పలు కార్పొరేట్ కంపెనీలు గుర్తించాయి. పనిలో నాణ్యత, శ్రద్ధ, హాజరు వంటి వాటిపై నవ్వు ప్రభావాన్ని తెలుసుకున్నారు. అందుకు శిక్షణ పేరుతో క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఇది వారి లాభాపేక్షతో చేసే చర్య అయినా పని ప్రదేశంలో నవ్వుల వాతావరణం మంచిదే. మానవ సంబంధాలు సరిగా లేని కంపెనీలు దెబ్బతినడం సహజమేనని ఒక సర్వేలో తేలింది. నవ్వు శిక్షకులకు నేటి జీవన మార్గంలో డిమాండ్ పెరిగింది. వారికి ఆశించినంత ఆదాయం కూడా లభిస్తోంది. నవ్వుకు…ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని శిక్షకులు తమ ప్రాథమిక పాఠంగా చెబుతారు. ఉద్వేగాలను అణుచుకోకూడదని నవ్వు వస్తే నవ్వాలని ఒక సర్వే చెబుతోంది. దీనివల్ల ప్రతి సీరియస్ విషయాన్ని లైట్‌గా తీసుకునే మనస్తత్వం పెంచుతుందనేది వీరివాదన.

హాస్యం అనేది నేటి జీవనశైలిలో భాగమైంది. హాస్యం క్లబ్బులు ఊరూరా వెలుస్తున్నాయి. వాకింగ్‌లో భాగంగా కొంతమంది క్లబ్‌గా ఏర్పడి మనసారా నవ్వుతున్నారు. పలు హాస్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరాల్లో వీటి ప్రాముఖ్యత పెరిగింది. హాస్యం వల్ల మనసు తేలిక పడుతుంది. బాధలు, భయాలు మర్చిపోతారు. హాస్యానికి ఉన్న ప్రాముఖ్యతను మన సినిమా రంగం ఏనాడో గుర్తించింది.

Humor is part of today’s lifestyle

Related Images:

[See image gallery at manatelangana.news]