రెండు లారీలు, బస్సు ఢీ….

    దివిటిపల్లి: మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి మండలంలో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు, ఓ ఆర్టీసి బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన డ్రైవర్ ను జడ్చర్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక లారీలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. సిలిండర్లు పేలుతాయనే ఉద్దేశంతో బస్సు దిగి ప్రయాణీకులు దూరంగా పరుగెత్తారు. సిలిండర్లు పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. […]

 

 

దివిటిపల్లి: మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి మండలంలో 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు, ఓ ఆర్టీసి బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన డ్రైవర్ ను జడ్చర్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక లారీలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. సిలిండర్లు పేలుతాయనే ఉద్దేశంతో బస్సు దిగి ప్రయాణీకులు దూరంగా పరుగెత్తారు. సిలిండర్లు పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడడంతో పోలీసులు రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. 

 

 

Related Stories: