ఈ ‘పాపం’ఎవరిదీ…?

 ముళ్ళ పొదలో పసికందు పిండం  గుమికుడిన జనం మన తెలంగాణ / ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో హుసేనీయ మసీదు పక్కనే ఉన్న మురికి కాలువ పక్కన గల ముళ్ల పొదల్లో ఏడు నెలల పిండం లభ్యం అయింది. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు పతంగులు ఎగరవేస్తున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. చిన్నారులు ఆడుకుంటు పతంగులు మురికి కాలువలో పడిపోవడంతో ఈ పిండాన్ని చూసి తొలుత బొమ్మ అనుకుని పెద్దలకు తెలిపారు. అయితే ఈ బొమ్మ కాదని పిండం […]

 ముళ్ళ పొదలో పసికందు పిండం
 గుమికుడిన జనం


మన తెలంగాణ / ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో హుసేనీయ మసీదు పక్కనే ఉన్న మురికి కాలువ పక్కన గల ముళ్ల పొదల్లో ఏడు నెలల పిండం లభ్యం అయింది. సంక్రాంతి సందర్భంగా చిన్నారులు పతంగులు ఎగరవేస్తున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. చిన్నారులు ఆడుకుంటు పతంగులు మురికి కాలువలో పడిపోవడంతో ఈ పిండాన్ని చూసి తొలుత బొమ్మ అనుకుని పెద్దలకు తెలిపారు. అయితే ఈ బొమ్మ కాదని పిండం అని నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పసికందు పిండాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనవత్వాన్ని మంటకలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఎవరో ఏ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇలాంటి పని చేసిన వారికి చట్ట పరంగా శిక్షించే విధంగా చూడాలని కాలనీ వాసులతో పాటు మసీదు ఇమామ్ మంజుర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

 

Related Stories: