ఇక ఇపాస్‌తో కిరోసిన్

  అక్రమ కిరోసిన్ దందాకు అడ్డుకట్టు ఇక అక్రమ బియ్యం దందాపై ‘ఐ’ రిస్ లబ్ధిదారుల కనుపాపలతో అక్రమాలకు చెక్ ఉమ్మడి జిల్లాలో అమలులోకి వచ్చిన నూతన విధానం పూర్తయిన రేషన్ డీలర్ల శిక్షణ తీరనున్న వృద్ధులు, వికలాంగుల బాధలు మన తెలంగాణ/ఖమ్మం: రేషన్ బియ్యం మాదిరిగా ప్రజా పంపిణీ కిరోసిన్‌ను కూడా బయోమెట్రిక్ ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం పంపిణీని మాత్రమే బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేసి […]

 

అక్రమ కిరోసిన్ దందాకు అడ్డుకట్టు
ఇక అక్రమ బియ్యం దందాపై ‘ఐ’ రిస్
లబ్ధిదారుల కనుపాపలతో అక్రమాలకు చెక్
ఉమ్మడి జిల్లాలో అమలులోకి వచ్చిన నూతన విధానం
పూర్తయిన రేషన్ డీలర్ల శిక్షణ
తీరనున్న వృద్ధులు, వికలాంగుల బాధలు

మన తెలంగాణ/ఖమ్మం: రేషన్ బియ్యం మాదిరిగా ప్రజా పంపిణీ కిరోసిన్‌ను కూడా బయోమెట్రిక్ ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం పంపిణీని మాత్రమే బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేసి అక్రమ బియ్యం దందాకు చెక్ పెట్టిన విధంగానే కిరోసిన్ దందాకు కూడా అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఈనెల నుంచి కిరోసిన్ పంపిణీ కూడా అన్‌లైన్ ద్వారా జరగనుంది. ఆహార భద్రత (రేషన్)కార్డు హోల్డర్‌కి ప్రతి నెల ఒక లీటర్ నీలి కిరోసిన్‌ను పంపిణీ చేస్తారు. ఖమ్మం జిల్లాలో 300మంది హాకర్లు, 669 మందిరేషన్ డీలర్ల ద్వారా ఈ కిరోసిన్ పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 400 కిలోలీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ ద్వారా కాకుండా మ్యానువల్‌గా అందజేస్తున్నారు. దీనివల్ల నీలి రంగు కిరోసిన్ కూడా నల్లబజార్‌కు తరలివెళ్తుంది.

ఖమ్మం రూరల్‌లో కిరోసిన దందా పెద్ద ఎత్తున్న జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరికి కిరోసిన్ పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్లు రికార్డులో నమోదు చేసి ఆ కిరోసిన్‌ను డ్రమ్ముల కొది ప్రయివేట్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నమాదిరిగానే కిరోసిన్‌ను కూడా బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈనెల1వ తేది నుంచే ఈ కొత్తవిధానం అమలులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం రేషన్ షాపు డీలర్ల వద్ద బయోమెట్రిక్ మిషన్లు ఉన్నందున తొలి దశగా వీరి వద్ద ఉన్న బయెమెట్రిక్ మిషన్ ద్వారా కిరోసిన్ పంపిణీ జరుగుతుంది. కొత్త బయోమెట్రిక్ మిషన్ల వచ్చిన తరువాత వాటిని కిరోసిన్ హాకర్లకు అందజేసి వారి వద్ద కూడా అన్‌లైన్‌లో కిరోసిన్ పంపిణీ జరుగుతంది. అప్పటివరకు ప్రస్తుతం నడుస్తున్నపాత విధానంలోనే హాకర్లు కిరోసిన్‌ను విక్రయిస్తారు.

రేషన్ బియ్యంపై ‘ఐ’ రిస్ నిఘా
రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నిరుపేదలకు అందాల్సిన ప్రజాపంపిణీ బియ్యాన్ని కొంతమంది అక్రమదారులు అడ్డదారిలో పక్కదారి పట్టిస్తున్నారు. లబ్ధిదారులు లేకున్నా ఉన్నట్లు బోగస్ రేషన్ కార్డులను సృష్టించి వారికి చెందాల్సిన బియ్యాన్ని డీలర్లే మళ్లించేవారు. అంతేగాక లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేయకుండా నల్లబజార్‌లో విక్రయించుకునే వారు. రేషన్ బియ్యాన్ని రిసైక్లింగ్ చేసి మళ్లీ రైస్ మిల్లు యజమానులకే విక్రయించేవారు. ఒక దశలో ఈ బియ్యం సముద్రం గుండా బయటి దేశాలకు సైతం తరలివెళ్లాయి. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయాల నష్టం వాటిల్లింది. దీంతో రెండేళల క్రితం ఈపాస్ విధానంతో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ (వేలిముద్రలు)విధానంను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసింది. అయితే రేషన్ కార్డు లబ్ధిదారుల్లో వృద్ధులు, వికలాంగుల వేలి ముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో సరిగా పోల్చలేకపోవడంతో వారికి బియ్యాన్ని పంపిణీ చేసేవారు కాదు.

దీంతో వారికి సంబంధించిన బియ్యాన్ని రేషన్ డీలర్లు బయట మార్కెట్లో విక్రయించుకునేవారు. దీంతో ఐరిస్ ద్వారా ఈ అక్రమానికి తెరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆధార్ కార్డ్ నమోదు సమయంలో బయోమెట్రిక్‌తోపాటు ఐరిస్(కనుపాపలు)ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఐరిస్‌తో అక్రమదందాకు అడ్డుకట్టవేయాలని భావించింది. ఇందుకుగాను ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లాలో అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో ఈనెల1వ తేదినుంచి రాష్ట్రంలో 16 జిల్లాలో అమలు చేస్తున్నారు. అందులో ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాలు కూడా ఉన్నాయి. రెండు జిల్లాలో కలిపి మొత్తం 1111 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 6,27,916 ఆహార భద్రత (రేషన్)కార్డులు, ఆరు అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో 669 రేషన్ దుకాణాలు, 3,67,592 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్తగూడెం జిల్లాలో 442 రేషన్ షాపులు, 260324 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ప్రతి నెల వేలాది టన్నుల బియ్యాన్ని ప్రజాపంపిణీ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యాన్ని పేదలందరికి సక్రమంగా అందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికి అనేక అధునిక పద్ధతుల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐరిస్ యంత్రం ద్వారా ఇకపై వేలిముద్రలు సరిగ్గా పడని వారికి బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే1111 ఐరిస్ మిషన్లు రెండు జిల్లాలకు చేరాయి. ఈ మిషన్ల అపరేటింగ్‌పై ఇప్పటికే రేషన్ డీలర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.

State government decision to provide kerosene by biometric

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: