ఇన్ఫీ లాభం 30% డౌన్

ఆదాయంలో రెండంకెల వృద్ధి అంచనాలను అందుకోలేకపోయిన ఐటి దిగ్గజం ప్రతి షేరుకు రూ.4 స్పెషల్ డివిడెండ్‌కు బోర్డు ఆమోదం ముంబై: దేశీయ రెండో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమంగా రాణించింది. అక్టోబర్‌ డిసెంబర్(క్య్రూ3)లో కంపెనీ ఆదాయం అంచనాలను మించింది. అయితే అత్యధిక ఆపరేటింగ్ వ్యయం వల్ల నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. రూ.8,260 కోట్ల వరకు షేర్ బైబ్యాక్‌కు ఇన్ఫోసిస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరు గరిష్టంగా […]

ఆదాయంలో రెండంకెల వృద్ధి
అంచనాలను అందుకోలేకపోయిన ఐటి దిగ్గజం
ప్రతి షేరుకు రూ.4 స్పెషల్ డివిడెండ్‌కు బోర్డు ఆమోదం

ముంబై: దేశీయ రెండో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమంగా రాణించింది. అక్టోబర్‌ డిసెంబర్(క్య్రూ3)లో కంపెనీ ఆదాయం అంచనాలను మించింది. అయితే అత్యధిక ఆపరేటింగ్ వ్యయం వల్ల నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. రూ.8,260 కోట్ల వరకు షేర్ బైబ్యాక్‌కు ఇన్ఫోసిస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరు గరిష్టంగా రూ.800 చొప్పున బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. క్యూ3లో కంపెనీ నికర లాభం రూ.3,610 కోట్లతో 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో రూ.5,129 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. ఈమేరకు బిఎస్‌ఇ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ సంస్థ ఆదాయం 20.3 శాతం వృద్ధిని సాధించింది.

2018 డిసెంబర్ నాటి రూ.21,400 కోట్ల ఆదాయం నమోదు చేయగా, అంతకుముందు 2017 సంవత్సరం ఇదే సమయంలో రూ.17,794 కోట్లుగా ఉంది. 201819 ఆర్థిక సంవత్సరానికి కరెన్సీ ఆధారంగా రెవెన్యూ అంచనా 8.5 -9 శాతానికి కంపెనీ సవరించింది. క్లయింట్ ఆధారంగా చూస్తే క్యూ3లో వార్షిక వృద్ధి రెండంకెల(10.1 శాతం) వృద్ధిని చూశామని ఇన్ఫోసిస్ సిఇఒ, ఎండి సలీల్ పరేఖ్ అన్నారు. డిజిటల్ బిజినెస్‌లో 33.1 శాతంతో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశామని అన్నారు.1.57 బిలియన్ డాలర్లతో భారీ డీల్స్ 2019 సంవత్సరం తమకు ఎంతో ఆశావాహంగా ఉండనుందని ఆయన అన్నారు.

రూ.4 స్పెషల్ డివిడెండ్

కంపెనీ షేరు రూ.4 స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించింది. ఈమేరకు ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ డివిడెండ్ ద్వారా రూ.2,107 కోట్లను చెల్లించనుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కు ఇన్ఫోసిస్ బోర్డు ఆమోదం తెలిపింది.

క్యూ3 ముఖ్యాంశాలు

1. నికరలాభం రూ.3,610 కోట్లతో 30 శాతం క్షీణత
2. మొత్తం ఆదాయం రూ.21,400 కోట్లు, 20 శాతం వృద్ధి
3. స్పెషల్ డివిడెండ్‌కు ఇన్ఫోసిస్ బోర్డు ఆమోదం
4. ఒక్కో షేరుకు రూ.4 స్పెషల్ డివిడెండ్‌ను చెల్లించనున్న కంపెనీ
5. ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కు బోర్డు అనుమతి
6. రూ.8,260 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్న సంస్థ
7. ఒక్కో షేరు గరిష్టంగా రూ.800 చొప్పున బైబ్యాక్ నిర్ణయం
8. క్యూ-3లో 22.26 శాతంగా ఇబిఐటి మార్జిన్
9. వృద్ధి అంచనాలను పెంచిన ఇన్ఫోసిస్

అమ్మకాల ఒత్తిడితో నష్టాలు

97 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. వారాంతం శుక్రవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు చతికిలపడ్డాయి. దేశీయంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనిచ్చారు. దీంతో తొలుత ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆ వెంట నే నష్టాల వైపు పయనించాయి. రోజంతా నేలచూపులతోనే కదిలి చివరికి బలహీనంగానే ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ కీలకమైన 36,000 పాయింట్ల మార్క్ దిగువనే కదిలినప్పటికీ చివర్లో కొంతమేర కోలుకుంది. ఆఖరికి సెన్సెక్స్ 97 పాయింట్ల నష్టంతో 36,010 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు నీరసించి 10,795 వద్ద స్థిరపడింది. కాగా ఎన్‌ఎస్‌ఇలో రియల్టీ, పిఎస్‌యు బ్యాంక్స్, ఆటో 1 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్‌ఎంసిజి మాత్రమే 0.6 శాతం లాభపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్, ఇన్‌ఫ్రాటెల్, టిసిఎస్, యస్ బ్యాంక్, గెయిల్, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, ఎస్‌బిఐ, అదానీ పోర్ట్ 3 నుంచి -1 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఐటిసి, యుపిఎల్, విప్రో, ఐఒసి, హిందాల్కో, ఒఎన్‌జిసి, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, వేదాంతా లాభపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.15 శాతం మేరకు బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,420 నష్టపోగా, 1,193 లాభాలతో ముగిశాయి. గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.344 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ విక్రయించింది. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.11 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

Infosys Board approves to special dividends

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: