పచ్చి టమాటోలతో అనారోగ్య సమస్య

టొమాటోలను ఎంత బాగా పరిశుభ్రం చేసినా సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్ బ్యాక్టీరియా తొలగిపోదు. ఈ బ్యాక్టీరియా గాస్ట్రోఎంటెరిటిస్ వ్యాధిని సంక్రమింప చేస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా సంక్రమించడం పంట పండక ముందు తప్ప సాధారణంగా అందరూ భావించినట్టు పంటపండిన తరువాత కాదని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) పరిశోధకులు వెల్లడించారు. దీనికి తిరుగులేని సాక్షాన్ని చూపించ గలిగారు. మొక్క ప్రధాన వేరు నుంచి పక్క వేర్లు ఏర్పడే సమయంలో రంధ్రాలు ఏర్పడడం చూసి బ్యాక్టీరియా […]

టొమాటోలను ఎంత బాగా పరిశుభ్రం చేసినా సాల్మోనెల్లా టైఫిమ్యూరియమ్ బ్యాక్టీరియా తొలగిపోదు. ఈ బ్యాక్టీరియా గాస్ట్రోఎంటెరిటిస్ వ్యాధిని సంక్రమింప చేస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా సంక్రమించడం పంట పండక ముందు తప్ప సాధారణంగా అందరూ భావించినట్టు పంటపండిన తరువాత కాదని బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) పరిశోధకులు వెల్లడించారు. దీనికి తిరుగులేని సాక్షాన్ని చూపించ గలిగారు. మొక్క ప్రధాన వేరు నుంచి పక్క వేర్లు ఏర్పడే సమయంలో రంధ్రాలు ఏర్పడడం చూసి బ్యాక్టీరియా ఆ రంధ్రాల ద్వారా మొక్క లోకి ప్రవేశిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. కాలుష్య పూరితమైన సాగునీరు, ఆరుబయలు మల విసర్జన ఈ బ్యాక్టీరియా నేలలో ఏర్పడడానికి ప్రధాన కారణాలు. వంట చేసేటప్పుడు బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా మాత్రం బ్యాక్టీరియా కలిగి ఉన్న పచ్చి కూరగాయలను సలాడ్‌గా తయారు చేయడానికి ఉపయోగించినప్పుడు సోకుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. సలాడ్ తయారు చేయడానికి ఉపయోగించే ఇతర కూరగాయలకు కూడా ఇదే విధంగా బ్యాక్టీరియా సోకుతుందా లేదా అన్నది పరిశోధించ వలసి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

అందువల్ల ముడి కూరగాయలను ఆరగించడాన్ని మానుకోవలసి ఉంటుందని చెప్పారు. మొక్క సెల్యులోజ్‌ను తక్కువ చేయడానికి నిర్వీర్యం చేయడానికి కావలసిన ఎంజైమ్‌లు సాల్మోనెల్లా బ్యాక్టీరియాలో లేవని తెలిపారు. ఈ కారణంగా మొక్క కణగోడలను ఈ బ్యాక్టీరియా ఏమీ చేయలేదు. అందువల్ల ఎస్. టైఫిమ్యూరియమ్ బ్యాక్టీరియా సహజ సిద్ధంగా ఏర్పడే ద్వారాల ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ప్రధాన వేరు మార్పుల వల్ల పక్క వేరులు ఏర్పడుతుంటాయి. పక్క వేరు ఏర్పడే సమయంలో పక్క వేరు పొడుచుకుని బయటకు రాడానికి వీలుగా చిన్న రంధ్రాలు ఏర్పడుతుంటాయని ప్రొఫెసర్ చక్రవర్తి చెప్పారు. దీన్ని అవకాశం చేసుకుని పరాన్నజీవి మొక్కలోకి ప్రవేశించ డానికి ప్రయత్నిస్తుంది. పక్కవేళ్లు ఏర్పడడానికి వీలు కల్పించే రంధ్రాల ప్రదేశాల్లో అత్యధికంగా సాల్మోనెల్లా బ్యాక్టీరియా నివసించి ఉండడాన్ని పరిశోధకులు గమనించారు. మిగతా ప్రధాన వేళ్లతో ఈ వేళ్లను పోల్చి చూశారు. ఇతర పరాన్నజీవులకు మాత్రం మొక్క కణగోడలను గుల్ల చేసే శక్తి ఉంటుంది.

వేరు లోని అన్ని భాగాల్లో అవి విస్తరించి స్థిరంగా ఉంటాయి. నేలలో లవణ శాతం ఎక్కువగా ఉంటే పక్క వేళ్లు ఏర్పడడం ఎక్కువగానే ఉంటుంది. టొమాటో మొక్కల్లో ఈ లక్షణం బాగా కనిపించింది. టొమాటో పక్కవేళ్లు పెరిగిన కొద్దీ టొమాటో కాయలు సాల్మోనెల్లా బ్యాక్టీరియాకు గురి కావడం ఎక్కువగా కనిపించింది. లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో టొమాటో పండించినప్పుడు సాల్మోనెల్లా బ్యాక్టీరియా ప్రభావం కూడా మొక్కలో ఎక్కువగా కనిపించింది. లవణీకరణ చెట్టు పక్కవేళ్ల ఏర్పాటును ప్రోత్సహించడం సాల్మొనెల్లా బ్యాక్టీరియా విస్తరించడం తదితర విశేషాలపై సంబంధాలపై మొట్టమొదటి సారి ఈ పరిశోధన జరగడం చెప్పుకోదగిన విశేషం.

-సైన్స్ విభాగం
Unhealthy Problem with Green Tomatoes

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: