రొమాంటిక్ ట్రిప్.. బేబీమూన్

ఒక ఉదయం ఆ ఇంట్లోకి ఒక శుభవార్త వచ్చేసింది. వెన్నెల వెలుగులా నవ్వే పువ్వులా ఒక పాపాయి బోసి నవ్వులతో అల్లరితో ఆ పొదరింట్లోకి దంపతుల ప్రేమ కానుకగా రాబోతోంది. ఈ సందర్భాన్ని కాబోయే తల్లిదండ్రులు ఇంకో ప్రణయ యాత్రతో సెలబ్రేట్ చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. దానికి వారు పెట్టిన పేరు బేబీమూన్. అప్పటి వరకు నిషూచిగా ఆఫీస్‌కు పరుగులు తీసే అమ్మాయికి గర్భం దాల్చాక జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తన శరీరాన్ని […]

ఒక ఉదయం ఆ ఇంట్లోకి ఒక శుభవార్త వచ్చేసింది. వెన్నెల వెలుగులా నవ్వే పువ్వులా ఒక పాపాయి బోసి నవ్వులతో అల్లరితో ఆ పొదరింట్లోకి దంపతుల ప్రేమ కానుకగా రాబోతోంది. ఈ సందర్భాన్ని కాబోయే తల్లిదండ్రులు ఇంకో ప్రణయ యాత్రతో సెలబ్రేట్ చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. దానికి వారు పెట్టిన పేరు బేబీమూన్.

అప్పటి వరకు నిషూచిగా ఆఫీస్‌కు పరుగులు తీసే అమ్మాయికి గర్భం దాల్చాక జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తన శరీరాన్ని తనే అర్థ చేసుకుంటూ ఆందోళన పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె భాగస్వామి తోడ్పాటు కావాలి. తన పైన చూపించే శ్రద్ధ కావాలి. అందుకే వైద్యులు దంపతులని బేబీమూన్‌కు వెళ్ళమని సూచిస్తున్నారు.

ఆందోళనలూ, ఆలోచనలనూ పక్కన పెట్టి కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా దంపతులు ఇద్దరూ సేదదీరడమే బేబీ మూన్. డెలివరీకి వెళ్ళే ముందు దంపతులు వెళ్ళే రొమాంటిక్ ట్రిప్ బేబీమూన్. ఆ సమయంలో ఇష్టమైన ప్రదేశంలో ప్రశాంతంగా కొన్నాళ్ళు గడపడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆ సమయంలో దంపతుల మధ్య నెలకొనే అనుబంధంతో పిల్లల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ బేబీమూన్ కొత్తమీ కాదు. ఈ బేబీ మూన్ పదాన్ని షీలాకిట్జింగర్ అనే రచయిత తొలిసారి ఉపయోగించారు. గర్భిణీకి తొమ్మిది నెలలు చాలా కీలక మైనవి. వాటిలో ప్రతి మూడు నెలల కాలాన్ని ఒక భాగంగా పేర్కొంటారు.

గర్భస్థ శిశువు నాలుగు నుంచి ఆరునెలల కాలం బేబీమూన్ అనువుగా ఉంటుంది. చివరి నెలల్లో ఇతరత్రా సమస్యలు వస్తాయి. ఈ బేబీ మూన్ వెళ్ళే యాత్రలో ఏదైనా సమస్య వచ్చినా సత్వర వైద్య సహాయం దొరికేలా ఉండాలి. అలా వైద్య సదుపాయం మంచి ఆహారం, విమానాశ్రయం లేదా రైల్వేస్టేషన్ సౌకర్యం ఉన్న పర్యాటక ప్రదేశం అయి ఉండాలి.
ఆధ్యాత్మిక కేంద్రాలు మనసుని తేలిక చేస్తాయి అంటారు. మెడికల్ డాక్యుమెంట్లు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అత్యవసరమైన ఫోన్ నెంబర్లు తీసుకోవాలి. ముందుగా డాక్టర్ల ఆమోదం తీసుకోవాలి.

బేబీ మూన్‌కు ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే పరిసరాలు, చక్కని గాలి, నీరు లభించే ప్రదేశాలు ఎంచుకోవాలి. మనదేశంలో గోవా, ఊటీ, ఆగ్రా, సిమ్లా, కేరళ వంటి ప్రాంతాలు చాలా అందంగా అనువుగా ఉంటాయి.

మరీ ఎక్కువ దూరాలు ప్లాన్ చేసుకోకూడదు. ఈ ట్రిప్ పూర్తిగా పుట్టబోయే బిడ్డను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రదేశాలను చూసి సంతోషించడమే కాక, పుట్టబోయే బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎదగడం కోసం అన్న ఉద్దేశ్యాన్ని మర్చిపోకూడదు. తల్లి మానసికంగా ప్రశాంతంగా ఉంటే కడుపులో పాపాయి ప్రశాంతంగా ఉంటుంది. గర్భిణి ఒత్తిడికి దూరం అవుతుంది.

కొత్త ప్రాంతాలు చూడటం వల్ల మనసు ఉత్తేజంగా ఉంటుంది. శరీరంలో మేలు చేసే హార్మోనులు విడుదలై ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. కొన్ని ట్రావెల్ ఏజన్సీలయితే ఈ సమయంలో అనేక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పేరెంటల్ స్పా, మసాజ్‌లు, యోగా థెరఫీలు, చక్కని పోషకాహారం వంటివి ప్రత్యేకంగా డిజైన్ చేసి రకరకాల ప్యాకేజ్‌లు అందిస్తున్నారు.
కాబోయే తల్లిదండ్రులు పుట్టబోయే బిడ్డ గురించి మనస్ఫూర్తిగా మాటాడుకుందుకు సరికొత్త కలలు కనేందుకు ముఖ్యంగా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకొనేందుకు ఈ బేబీ మూన్ ఒక చక్కని అవకాశం.

అప్పటి వరకు నిషూచిగా ఆఫీస్‌కు పరుగులు తీసే అమ్మాయికి గర్భం దాల్చాక జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తన శరీరాన్ని తనే అర్థ చేసుకుంటూ ఆందోళన పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె భాగస్వామి తోడ్పాటు కావాలి. తన పైన చూపించే శ్రద్ధ కావాలి. అందుకే వైద్యులు దంపతులని బేబీమూన్ కు వెళ్ళమని సూచిస్తున్నారు.

Babymoon Trip

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: