ఫేస్‌బుక్‌లో అన్నీ పోస్ట్ చేస్తున్నారా..!

  ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్‌లేనివారు సాధారణంగా కనిపించరు. తోచినవన్నీ ఎఫ్‌బీలో పోస్ట్ చేయడం చాలా మందికి దినచర్యగా మారిపోయింది. దీనివల్ల ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నటే అంటున్నారు నిపుణులు. ఫేస్‌బుక్ చాలా సమాచారాన్ని వెల్లడిస్తుంది. ఫేస్‌బుక్‌లో అతి పెద్ద డేటా ఉంటుంది. మీ స్నేహితులు, తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మీ ఉద్యోగం, మీ అభిరుచులు, మీ పిల్లలు, ఇలా చాలా సమాచారం ఉంటుంది. సెక్యూరిటీ ప్రశ్నలకి ఇచ్చే ఎన్నో సమాధానాలు (వీటిని బ్యాంక్ లావాదేవీలు పాస్‌వర్డ్ […]

 

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్‌లేనివారు సాధారణంగా కనిపించరు. తోచినవన్నీ ఎఫ్‌బీలో పోస్ట్ చేయడం చాలా మందికి దినచర్యగా మారిపోయింది. దీనివల్ల ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నటే అంటున్నారు నిపుణులు.

ఫేస్‌బుక్ చాలా సమాచారాన్ని వెల్లడిస్తుంది. ఫేస్‌బుక్‌లో అతి పెద్ద డేటా ఉంటుంది. మీ స్నేహితులు, తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, మీ ఉద్యోగం, మీ అభిరుచులు, మీ పిల్లలు, ఇలా చాలా సమాచారం ఉంటుంది. సెక్యూరిటీ ప్రశ్నలకి ఇచ్చే ఎన్నో సమాధానాలు (వీటిని బ్యాంక్ లావాదేవీలు పాస్‌వర్డ్ రీసెట్స్‌కి ఉపయోగిస్తారు) కూడా ఫేస్‌బుక్ అకౌంట్‌లో దొరుకుతాయి. పైగా, ఫేస్‌బుక్ డిజైన్ మీ గోప్యతని కాపాడడానికి పెద్దగా ఏమీ పని చేయదు. అందరూ పరిమితుల్లో ఉండి, ఏ విషయాన్నీ బయటికి చెప్పకుండా ఉంటే సోషల్ మీడియా సరిగ్గా పనిచేయదు. చాలా మంది యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకుందామనుకున్నా, తీసుకోవలసిన జాగ్రత్తలు పెద్దగా తీసుకోరు.ఎవరైనా తాము ఆన్‌లైన్‌లో పెడుతున్న విషయానికి గల రిస్క్‌ని నిజంగా అర్థం చేసుకుంటే, అలా పోస్ట్ చేసే ముందు వాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

ఉదా.
* కొత్త డ్రైవర్లు ఈ జాబితాలోకి టీనేజీలో పిల్లలు (లేదా పెళ్లయినవాళ్లు కూడా) వస్తారు. వీళ్లు కొత్తగా అప్లై చేసే లైసెన్సు కోసం క్లోజ్ అప్ ఫొటో తీయించుకుంటారు. ఇందులో వీళ్ల వ్యక్తిగత సమాచారం, ఇంటి అడ్రస్ అన్నీ ఉంటాయి. కొత్త ఇంటి యజమానులు కొత్తగా ఇళ్లు కట్టుకున్నవారు గృహ ప్రవేశం వైభవోపేతంగా జరుపుకుంటారు. వాళ్ల ఇంటి తలుపుకీ నమూనా, ఆ ఇంటి జియో ట్యాగింగ్‌తో వాళ్లకి తెలియకుండానే, ఒక ఫొటోతో ఆ ఇంటి డూప్లికేట్ కీ తయారు చేయడం సాధ్యపడుతుంది. ఉద్యోగులు ఉద్యోగులు తరచుగా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. తమ వెనకా, ముందూ ఎలాంటి ప్రదేశాలు పిక్చర్‌లోకి వస్తున్నాయో గమనించరు. ఫొటో బ్యాక్ గ్రౌండ్‌లో ఒకోసారి కంప్యూటర్ మానిటర్ ఓపెన్ అయి ఉంటుంది. పాస్‌వర్డ్‌లు, వైట్‌బోర్డులపై కీలకమైన సమాచారం, వాయిస్‌మెయిల్ పాస్‌వర్డ్ ఉంటాయి. వాటిని ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే, ఉద్యోగులు తమ పేచెక్ వంటి వాటిని కూడా ఫొటో తీసి పోస్ట్ చేస్తుంటారు. కొంత మందికి ఇలాంటి పోస్ట్‌ల్లో తప్పేముందీ అనిపిస్తుంది. గానీ హ్యాకర్లు ఇలాంటి ఫొటోల్ని తమ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉంది.
సోషల్‌మీడియాలో ఎన్నడూ చేయకూడని పని ఏటంటే… ఆలోచించకుండా పోస్ట్ చేయడం. ఏదైనా పోస్ట్ చేసే ముందు, కొన్ని ప్రశ్నలు మీ మనసులోకి రావాలి. ‘నేను ఎలాంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెడుతున్నాను?’ ‘ నా చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమేమి ఉన్నాయి?’ ‘ఒకవేళ నా మీద నేను కక్ష తీర్చుకోవాలంటే, ఈ సమాచారాన్ని నాకు వ్యతికేకంగా నేను ఎలా ఉపయోగించగలను? ఇలాంటివన్నీ ఆలోచించాలి.
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ :
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కొన్ని రకాల స్కామ్ అకౌంట్లని తగ్గించడానికి ఉపకరిస్తుంది. కానీ దానితోనే పూర్తిగా అడ్డుకట్ట పడదు. హ్యాకర్లు చాలా నిపుణులై ఉంటారు. ఇలాంటి ఆటంకాల్ని అధిగమించడానికి కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ వికృతానందంలో ఉంటారు. ఇది దాదాపుగా పిల్లీ ఎలుకా చెలగాటంగా ఉంటుంది. మరో వైపు, ఫేస్‌బుక్‌ని మరింత శక్తివంతం చేయడానికి, మనం మరింత వ్యక్తిగత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. చాలా మంది తమ ప్రైవసీకి ఎంత విలువ ఇస్తున్నారంటే, చివరికి సోషల్ మీడియాలో వాళ్ల అకౌంట్లలో పేర్లు కూడా వాళ్లవి కావు. నకిలీ పేర్లు పెట్టుకుంటారు. వాళ్ల ఫొటోలు పెట్టరు. ఏవో జంతువుల పేర్లు పెట్టుకుంటారు. ఒక నకిలీ ఫ్రొఫైల్‌ని ఆపాలంటే.. అకౌంట్ హోల్డర్లు ఫేస్‌బుక్‌లో వాళ్ల అసలు పేరు ఇవ్వాలి, అసలు ముఖం చూపించాలి. న్యూడ్ ఫొటోలు అడిగి ఫేస్‌బుక్‌లో రివెంజ్ పోర్న్ చేసేవారితో తలపడడానికి ఇది మంచి ఐడియాగా పనిచేస్తుంది. వాళ్ల దగ్గర అవి ఉంటే, వాటిని ఓ ఆటో మేషన్ స్టాండ్‌పాయింట్ నుంచి వాటిని నాశనం చేయడం సాధ్యపడుతుంది.
పాస్‌వర్డ్, సెక్యూరిటీ ప్రశ్నలు అందులో ఎన్నో రకాల ఉల్లంఘనలు
డేటా లాక్కోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉదా. సోషల్ ఇంజనీరింగ్ దాడులు, అప్లికేషన్‌లో ఉండే లొసుగులు, అన్‌ప్యాచ్డ్ సర్వర్స్, ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ లేకపోవడం, బలహీనమైన, దొంగలించబడిన క్రెడెన్షియల్స్ మొదలైనవి చాలా ఉంటాయి. ఇలాంటి లోపాలు తలెత్తుతూనే ఉంటే, డేటా అలా జారిపోతూనే ఉంటుంది. ఎవరైనా సరే, మంచి పాస్‌వర్డ్ పెట్టుకునే అలవాటు చేసుకోవాలి. పాస్‌వర్డ్ అనేవి వ్యక్తి, కార్పొరేషన్ ఇరు పక్షాలకీ సంబంధించిన బాధ్యత. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
*పాస్‌వర్డ్‌ని ఎక్కువసార్లు ఉపయోగించకండి. తరచుగా మీ పాస్‌వర్డ్‌ని మారుస్తూ ఉండండి, పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించండి. మీ పాస్‌వర్డ్ ఛేదించడానికి సాధ్యం కానంత చాలా విలక్షణంగా ఉండాలి. ఎక్కడ నుంచైనా పరే, మీరు లాగిన్ అయ్యేలా ఉండాలి.
* కామన్‌గా అడిగే సెక్యూరిటీ ప్రశ్నలకి అబద్ధాలు చెప్పండి. మీ అమ్మగారి అసలు పేరేమిటో కరెక్టుగా నింపనవసరం లేదు. ఎవరూ తేలిగ్గా ఊహించలేని ‘న్యూటెల్లా లేదా ‘డిస్నీలాండ్’ లాంటి పేరేదో అక్కడ రాస్తే సరిపోతుంది.
* టూ ఫ్యాక్టర్ ఆథంటికేషన్‌ని ఉపయోగించాలి. చాలా సైట్లలో మీకు ఈ అదనపు సెక్యూరిటీ సెట్టింగ్‌ని సెటప్‌చేసుకునే ఆప్షన్ ఉంటుంది.
మన సమాచారాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకోవాలనుకునే ఈ స్కామర్లు/ హ్యాకర్లు ఎవరు?
అవకాశాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకోవాలని చూసే వాళ్లే స్కామ్ చేయాలనీ,హ్యాక్ చేయాలనీ చూస్తారు. మిగతా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లాగే, వాళ్లు పరిస్థితుల్ని తమ వైపు ఆకర్షింపబడేలా చేసుకుంటారు. దీంతో రిస్కు విపరీతంగా పెరుగుతుంది. చాలా చోట్ల ఇలా జరగడానికి కారణం, స్థానిక చట్టాలు ఈ పనిని అడ్డుకునే రిస్కు తీసుకోవు. అసలు హ్యాకర్ ఎవరూ, ఏమిటీ అనేది విషయం కాదు ఇక్కడ! వాళ్లకి కావలసిన సమాచారం అక్కడ ఉంటుంది. వాళ్ల దగ్గర ఆ సమాచారాన్ని చేరుకునే మార్గం ఉంది. ఆ సమాచారం విలువైనదీ, దానికి బాగా డబ్బు వస్తుందనుకుంటే, వాళ్లు తమ సామర్థంతో దాన్ని అందుకున్నారు. చాలా సందర్భాల్లో వాళ్లు భయంకరమైన విజయాలు సాధించారు. షాప్స్ విషయంలో అయితే, ఇది కేవలం నెంబర్ల గేమ్ మాత్రమే. స్కామర్లకి టెలీమార్కెటింగ్ కాంపెయిన్స్‌ని పోలిన కాల్ సెంటర్ ఉంటుంది. వాళ్లకి లీడ్ జనరేషన్, డైలాగ్ స్క్రిప్ట్‌లు, ఇంటర్నల్ ఎస్కలేషన్, ట్రైనింగ్, చివరికి కోటాలు కూడా ఉంటాయని నిపుణుల అభిప్రాయం.
కాజువల్‌గా ఇంటర్నెట్ వాడేవారు ఏ విషయంపై స్పృహ కలిగి ఉండాలంటే…
ఈ సెక్యూరిటీ సమస్యలు అంత వెంటనే పరిష్కారమయ్యేవి కావు. పైగా, మిమ్మల్ని మీరు ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితంగా ఉందామని ప్రయత్నించినా కూడా సాధ్యం కాదు. కాకపోతే,జాగ్రత్తలు తీసుకొని మిగతా వారితో పోలిస్తే, వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకునే ప్రయత్నం మాత్రం చేయవచ్చు. ఎవరికి వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటే కొంత కాలానికి హ్యాకర్సు వాళ్ల తుంటరి చర్యల్ని విడిచిపెడతారని ఆశించవచ్చు!

Be Careful What you post on facebook

 

Related Images:

[See image gallery at manatelangana.news]