అన్నారం బ్యారేజీ ప‌నుల‌ను ప‌రిశీలించిన కెసిఆర్‌

కరీంనగర్: అన్నారం బ్యారేజీ పనులను సిఎం కెసిఆర్ పరిశీలించారు. కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే, కెసిఆర్ రెండో రోజు పర్యటన కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి ప్రారంభించారు. కన్నేపల్లి, అన్నారం వరకు నిర్మిస్తున్న 13.2 కి.మీ గ్రావిటీ కాలువ పనులను సిఎం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ వెంబండి లైనింగ్ పనులను పరిశీలించిన ఆయన… వాహనంలో వెళ్తూ మధ్యలో ఆగి కాలువ నిర్మాణ పనులను, […]

కరీంనగర్: అన్నారం బ్యారేజీ పనులను సిఎం కెసిఆర్ పరిశీలించారు. కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే, కెసిఆర్ రెండో రోజు పర్యటన కన్నేపల్లి పంపుహౌస్ గ్రావిటీ కెనాల్ నుంచి ప్రారంభించారు. కన్నేపల్లి, అన్నారం వరకు నిర్మిస్తున్న 13.2 కి.మీ గ్రావిటీ కాలువ పనులను సిఎం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ వెంబండి లైనింగ్ పనులను పరిశీలించిన ఆయన… వాహనంలో వెళ్తూ మధ్యలో ఆగి కాలువ నిర్మాణ పనులను, నాణ్యతను నిశితంగా పరిశీలించారు. లైనింగ్ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారు. అనంతరం అన్నారం బ్యారేజీ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ పనులు 90శాతం మేర పూర్తికావొచ్చాయని సిఎం కెసిఆర్ కు అధికారులు వివరించారు.

CM KCR Review on Kannepalli Pump House Works

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: