రాఫెల్‌పై జెపిసి ప్రసక్తే లేదు : జైట్లీ

న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగనప్పుడు జెపిసి అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వారి ఆరోపణలలో పసలేదని, సుప్రీంకోర్టు తీర్పులో డీల్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఒప్పందంపై కాగ్ అభిప్రాయం ఏమిటనేది అసంబద్ధం అవుతుందని జైట్లీ తెలిపారు. రాఫెల్‌పై కాంగ్రెస్ వైఖరి దారుణంగా ఉందని, దెబ్బతింటున్న వారి ధోరణి ఇప్పుడు తేటతెల్లం అవుతోందన్నారు. జెపిసి […]

న్యూఢిల్లీ : రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగనప్పుడు జెపిసి అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వారి ఆరోపణలలో పసలేదని, సుప్రీంకోర్టు తీర్పులో డీల్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఒప్పందంపై కాగ్ అభిప్రాయం ఏమిటనేది అసంబద్ధం అవుతుందని జైట్లీ తెలిపారు. రాఫెల్‌పై కాంగ్రెస్ వైఖరి దారుణంగా ఉందని, దెబ్బతింటున్న వారి ధోరణి ఇప్పుడు తేటతెల్లం అవుతోందన్నారు. జెపిసి ఏర్పాటుతోనే నిజాలు నిర్థారణకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటోంది. సోమవారం నుంచి తిరిగి పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో రాఫెల్ డీల్ ప్రధానంగా ఇరు పక్షాల తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధాలకు మరింత అవకాశం ఏర్పడింది. ఈ దశలోనే జెపిసి ఏర్పాటు కుదరదని జైట్లీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సజావుగా సాగాలనే ఆలోచన లేదని, రాఫెల్‌పై తరచూ ఆటంకాలకు దిగుతోందని విమర్శించారు.

రాఫెల్‌డీల్‌పై సుప్రీంకోర్టు తుది మాట చెప్పిందని , క్లీన్‌చిట్ ఇచ్చిందని ఇక డీల్‌కు చట్టబద్ధత తిరుగులేకుండా దక్కిందని , ఈ దశలో జెపిసి ఏర్పాటుతో ప్రయోజనం ఏముంటుందని జైట్లీ ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పినదానికి విరుద్ధంగా రాజకీయ కమిటీ నిర్థారణకు రాజాలదని అయితే వారికి ఈ విధంగా వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నట్లు అర్ధం అవుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు. రాఫెల్‌పై సుప్రీంకోర్టు తీర్పులో అస్పష్టత ఉందనే కాంగ్రెస్ వాదనను జైట్లీ ప్రస్తావించారు. డీల్‌ను కాగ్‌కు అందించారని, అక్కడి నుంచి పిఎసికి వెళ్లిందని తీర్పులో ఉందని, అయితే పిఎసి వద్దకు రానేలేదని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై జైట్లీ స్పందిస్తూ సాధారణంగా రక్షణ లావాదేవీలను కాగ్ పరిధిలోకి ఆడిట్ రివ్యూకు పంపిస్తారని తరువాత పిఎసి సమీక్షకు వెళ్లుతాయని జైట్లీ వివరించారు. అన్ని అంశాలను కాగ్ పరిశీలించుకుని తరువాత పిఎసికి పంపించడం జరుగుతుందన్నారు.

Arun Jaitley slams Rahul Gandhi

Related Images:

[See image gallery at manatelangana.news]