రేవంత్ బూతు పురాణం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డికి సంబంధించిన మరో వివాదం వెలుగు చూసింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ముందు ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో కొడంగల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ అనే అధికారిని రేవంత్‌రెడ్డి ఫోన్‌లో పరుష పదజాలంతో దూషించడం ఇప్పుడు ఆడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొరుగున ఉన్న నియోజకవర్గం ఎంఎల్‌ఎ వచ్చిన సందర్భంలో కొడంగల్ అధికారులు ఆ ఎంఎల్‌ఎ వద్దకు […]

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డికి సంబంధించిన మరో వివాదం వెలుగు చూసింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు ముందు ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో కొడంగల్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ అనే అధికారిని రేవంత్‌రెడ్డి ఫోన్‌లో పరుష పదజాలంతో దూషించడం ఇప్పుడు ఆడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొరుగున ఉన్న నియోజకవర్గం ఎంఎల్‌ఎ వచ్చిన సందర్భంలో కొడంగల్ అధికారులు ఆ ఎంఎల్‌ఎ వద్దకు వెళ్లినట్లు ఆయనకు సమాచారం అందడంతో ఆగ్రహానికి గురైన రేవంత్‌రెడ్డి సదరు ఎ.ఇ.కి ఫోన్ చేసి బండబూతులు తిట్టారు.

అధికారి అనే విచక్షణ కూడా లేకుండా ‘ఈపులు పలగొడతా, నిన్ను బట్టలూడదీసి కార్యకర్తలతో కొట్టిస్తా’ లాంటి పదాలతో రేవంత్ పరుషభాషలో తిట్ల పురాణం అందుకున్నారు. ఎంపిడిఒ, డిఇ బాబు రావు చెబితే తాను అక్కడికి వెళ్లానంటూ ఎ.ఇ. వినోద్ వివరణ ఇస్తున్నా ‘ఎవడాడుడి.ఇ? వానికి నీకు పెళ్లయితది. వీపు విమానం మోత మోగుతది. కొడంగల్‌లోనే వాడిని. కార్యకర్తలతో నిన్ను బట్టలూడదీసి కొట్టిస్తా. తమాషా చేస్తున్నట్లున్నరు. తోడ్కలూడతయి వినోద్. బాబురావు నెంబర్ పంపించు. తోడ్కలూడతయని బాబురావుకు, ఎండిపిఒకు చెప్పిన అని నువ్వే చెప్పు‘ అంటూ దుర్భాషలాడారు. కొడంగల్‌కు ఇద్దరు ఎంఎల్‌ఎలు ఉన్నరా అంటూ ఆ అధికారిని చెడామడా తిట్టారు. పొరుగున ఉన్న నియోజకవర్గం ఎంఎల్‌ఎ గురించి మరింత పరుషమైన పదజాలాన్నే ప్రయోగించారు.

Revanth Reddy Controversial Issues

Telangana news

Related Stories: