టాప్ 100 రియల్టర్ల సంపద 27 శాతం పెరిగింది..

ముంబై: ప్రపంచంలో ఇళ్లు లేని వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో రియల్టీ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయినప్పటికీ 2018 సంవత్సరంలో భారత్‌లో టాప్100 రియల్టర్ల నికర ఆస్తుల విలువ 27 శాతం పెరిగి రూ.2,37,000 కోట్లకు చేరింది. లోధా గ్రూప్ వ్యవస్థాపకుడు మంగళ్ ప్రభాత్ లోధా నివేదిక తెలిపింది. దేశీయ అతిపెద్ద డెవలపర్ డిఎల్‌ఎఫ్ గ్రూప్ వ్యవస్థాపకుడు కెపి సింగ్ 2017 సంవత్సరంలో అత్యంత సంపన్ను రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా నిలిచారు. […]

ముంబై: ప్రపంచంలో ఇళ్లు లేని వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో రియల్టీ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయినప్పటికీ 2018 సంవత్సరంలో భారత్‌లో టాప్100 రియల్టర్ల నికర ఆస్తుల విలువ 27 శాతం పెరిగి రూ.2,37,000 కోట్లకు చేరింది. లోధా గ్రూప్ వ్యవస్థాపకుడు మంగళ్ ప్రభాత్ లోధా నివేదిక తెలిపింది. దేశీయ అతిపెద్ద డెవలపర్ డిఎల్‌ఎఫ్ గ్రూప్ వ్యవస్థాపకుడు కెపి సింగ్ 2017 సంవత్సరంలో అత్యంత సంపన్ను రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా నిలిచారు. అయితే ఈ ఏడాదిలో టాప్ 10 డెవలపర్ల జాబితాలో ఆయన చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. హురుర్ సంపన్నుల జాబితా 2018 ప్రకారం, 62 ఏళ్ల లోధా(సీనియర్ బిజెపి నాయకుడు) అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

ఆయన ఆస్తుల విలువ రూ.27,150 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్ జితేంద్ర విర్వాని ఉండగా, ఆయన ఆస్తుల విలువ రూ.23,160 కోట్లుగా ఉంది. గత సంవత్సరం సిటీకి చెందిన లోధా రూ.18,610 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా, డిఎల్‌ఎఫ్ కౌషల్ సింగ్ రూ.23,460 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కెపి సింగ్ తొలి పది స్థానాల్లో కూడా చోటు దక్కించుకోలేదు. అయితే కెపి సింగ్ కుమార్ రాజీవ్ సింగ్ ఈ సంవత్సరం రూ.17,690 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేమిటంటే సీనియర్ సింగ్ డిఎల్‌ఎఫ్ రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ.. తన వాచాలను కుమారుడు రాజీవ్, కుమార్తె పియాలకు బదిలీ చేశారు. ‘2018లో టాప్ 100 రియల్ ఎస్టేట్  డెవలపర్స్ మొత్తం ఆస్తుల విలువ రూ. 2,36,610 కోట్లు నమోదైంది. 2017 సంవత్సరంలో రూ. 1,86,700 కోట్లతో పోలిస్తే 27 శాతం వృద్ధిని సాధించింది’ అని హురుర్‌గ్రోహె ఇండియా (జర్మన్ సానిటరీవేర్ తయారీసంస్థ) సంపన్నుల జాబితా2018 వెల్లడించింది.

India faces crisis in realty

Telangana Latest News

Related Stories: