కేరళను ఆదుకున్న జలజ్

కోల్‌కతా: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యాన్ని సాధించింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన కేరళ 291 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జలజ్ సక్సెనా అద్భుత సెంచరీతో కేరళను ఆదుకున్నాడు. బెంగాల్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జలజ్ కేరళకు భారీ ఆధిక్యం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన జలజ్ పరుగుల వరద పారించాడు. […]

కోల్‌కతా: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యాన్ని సాధించింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన కేరళ 291 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జలజ్ సక్సెనా అద్భుత సెంచరీతో కేరళను ఆదుకున్నాడు. బెంగాల్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న జలజ్ కేరళకు భారీ ఆధిక్యం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన జలజ్ పరుగుల వరద పారించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను పోరాటం కొనసాగించాడు. వాసుదేవన్ జగదీష్, అక్షయ్ చంద్రన్ అండతో జలజ్ బెంగాల్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జలజ్ 190 బంతుల్లో 21 ఫోర్లు, రెండు సిక్సర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షయ్ చంద్రన్ ఆరు ఫోర్లతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టి బెంగాల్ బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఐదు పరుగులు చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటాలంటే బెంగాల్ మరో 139 పరుగులు చేయాలి.

తమిళనాడు 122/3
ఆంధ్రాతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. బుధవారం రెండో రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. ఆంధ్రా మొదటి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. గిరినాథ్ రెడ్డి 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతావారిలో జ్యోతి సాయికృష్ణ (58), షోయబ్ ఖాన్ (26) మాత్రమే రాణించారు. తమిళనాడు బౌలర్లలో మహ్మద్ నాలుగు, నటరాజన్, సాయి కిశోర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఓపెనర్లు కౌశిక్ గాంధీ (36), అభినవ్ ముకుంద్ (31) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆంధ్రా కాస్త తేరుకుంది. అంతేగాక కెప్టెన్ ఇంద్రజీత్ (7) కూడా ఔట్ కావడంతో తమిళనాడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాగా, ఆంధ్రా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే తమిళనాడు మరో 94 పరుగులు చేయాలి.

Kerala won the first innings of the Ranji Trophy match

Telangana Latest News

Related Stories: