శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బులెట్ల కలకలం

శంషాబాద్: అక్రమంగా బులెట్లు కలిగిన ఓ వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటివల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో జరిగిన ఫార్ములా వన్ రేసులో పాల్గొన్నడానికి వచ్చిన ఇటలికి చెందిన ఓ రేసర్ తిరిగి పోవడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులోని స్కానింగ్ రూమ్‌లో లాగేజిని స్కానింగ్ చేయగా బులెట్లు ఉన్నట్టు సిఐఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించారు. దీంతో అతని అదుపులోకి తీసుకొని […]

శంషాబాద్: అక్రమంగా బులెట్లు కలిగిన ఓ వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటివల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో జరిగిన ఫార్ములా వన్ రేసులో పాల్గొన్నడానికి వచ్చిన ఇటలికి చెందిన ఓ రేసర్ తిరిగి పోవడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులోని స్కానింగ్ రూమ్‌లో లాగేజిని స్కానింగ్ చేయగా బులెట్లు ఉన్నట్టు సిఐఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించారు. దీంతో అతని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 22 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు తెలిపారు.

Man Caught With 22 Bullets In Shamshabad Airport

Telangana Latest News

Related Stories: