కొడంగల్‌ను దత్తత తీసుకుంటా: కెటిఆర్

వికారాబాద్:కొడంగల్‌కు నీళ్లు కావాలా?.. కన్నీళ్లు కావాలా? అని మత్రి కెటిఆర్ కొడంగల్ ప్రజలను ప్రశ్నించారు. బుధవారం  జిల్లాలోని కొడంగల్ పట్టణంలో కెటిఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కొడంగల్‌లో  టిఆర్‌ఎస్‌ను గెలిపించండి.. కొడంగల్‌ను నేను దత్తత తీసుకుంటా … సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. గత పాలకులు 200 రూపాయల పెన్షన్ ఇచ్చేందు కు నానా […]

వికారాబాద్:కొడంగల్‌కు నీళ్లు కావాలా?.. కన్నీళ్లు కావాలా? అని మత్రి కెటిఆర్ కొడంగల్ ప్రజలను ప్రశ్నించారు. బుధవారం  జిల్లాలోని కొడంగల్ పట్టణంలో కెటిఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కొడంగల్‌లో  టిఆర్‌ఎస్‌ను గెలిపించండి.. కొడంగల్‌ను నేను దత్తత తీసుకుంటా … సిరిసిల్ల తరహాలో కొడంగల్‌ను అభివృద్ధి చేస్తానని మంత్రి తెలిపారు.

సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. గత పాలకులు 200 రూపాయల పెన్షన్ ఇచ్చేందు కు నానా గోస పెట్టారన్నారు. డిసెంబర్ 11 తర్వాత  పెన్షన్లన్నీ రెట్టింపు చేసి, పెన్షన్ల వయోపరిమితి 58 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్ 17 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశారని, రైతుల కోసం మరింత చేయాలన్నదే  ఆయన  లక్ష్యమన్నారు. ఢిల్లీ, అమరావతి బానిసలు మనకు అవసరమా?, కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా? అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన కెసిఆర్ వైపు ఉందామా? అని మంత్రి కెటిఆర్ కొడంగల్ ప్రజలను ప్రశ్నించారు.

KTR Roadshow in Kodangal town

Related Stories: