నటుడిపై కేసు నమోదు

బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ (62)పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలోక్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఓసివార పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. అలోక్ తనపై అత్యాచారం చేశాడంటూ రచయిత్రి  వింతానంద ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దేశంలో మీటూ ఉద్యమం జోరుగా సాగుతోంది. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై అన్ని రంగాలతో పాటు సినిమా నటీమణులు కూడా బయట పెడుతున్నారు. అలోక్ సినిమాలు, టివి సీరియళ్లలో […]

బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ (62)పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అలోక్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఓసివార పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. అలోక్ తనపై అత్యాచారం చేశాడంటూ రచయిత్రి  వింతానంద ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  దేశంలో మీటూ ఉద్యమం జోరుగా సాగుతోంది. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై అన్ని రంగాలతో పాటు సినిమా నటీమణులు కూడా బయట పెడుతున్నారు. అలోక్ సినిమాలు, టివి సీరియళ్లలో తండ్రి పాత్రలతో మెప్పించారు. తనపై వింతానందపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ ఆమెపై అలోక్ పరువు నష్టం దావా చేశారు కూడా. అలోక్ పై ఆరోపణలు రావడంతో సింటా ఆయన్ను బహిష్కరించింది. ఈ అంశం  ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనమైంది.

Police Case Filed Against Bollywood Actor Alok Nath

Related Stories: