చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ వింటోంది

కరీంనగర్: పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు మాటవిని కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేస్తారని మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం కేశ‌వ‌ప‌ట్నంలో నిర్వహించిన నియోజకవర్గ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ వింటోందని, పోలవరం కింద మూడో పంటకు నీళ్లు అందవనే ఉద్దేశంతో చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తారని […]

కరీంనగర్: పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు మాటవిని కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేస్తారని మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం కేశ‌వ‌ప‌ట్నంలో నిర్వహించిన నియోజకవర్గ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ వింటోందని, పోలవరం కింద మూడో పంటకు నీళ్లు అందవనే ఉద్దేశంతో చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తారని మంత్రి విమర్శించారు.

అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని రద్దు చేస్తామని.. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కూడా రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ప్రజలు చూస్తున్నారన్నారు. మానకొండూర్‌ను సిద్ధిపేట, హుజురాబాద్ నియోజకవర్గాల తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం పూర్తయితే మానకొండూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పదవికి రాజీనామా చేయని ఆరెపల్లి మోహన్ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. అప్పుడు ఉద్యమాన్ని.. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గట్టిబుద్ధి చెప్పాలని హరీశ్ రావు ప్రజలను కోరారు.

Harish rao speech at keshavapatnam sabha

Related Stories: