‘ఉల్లి రైతు గగ్గోలు’

బెంగళూరు: కర్నాటకలో ఉల్లి పంట కన్నీరు పెట్టిస్తోంది. ధరలు హఠాత్తుగా పతనమై కిలో ఉల్లి ఒక రూపాయికే హోల్ సేల్ లో లభిస్తుండడంతో ఒక పక్క రైతులు లబోదిబో మంటుండగా వినియోగదారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా ఉల్లి పండేది కర్నాటకలోనే. హుబ్లి, ధార్వాడ్, హవేరి, గడగ్, బాగల్ కోట్, బెల్గాం, దావణగెరె, చిత్రదుర్గలోనే హోల్ సేల్ మార్కెట్లలో వంద కిలోల ఉల్లి బస్తా కేవలం వంద రూపాయలకే లభిస్తోంది. వారం క్రితం వరకు క్వింటాలు […]

బెంగళూరు: కర్నాటకలో ఉల్లి పంట కన్నీరు పెట్టిస్తోంది. ధరలు హఠాత్తుగా పతనమై కిలో ఉల్లి ఒక రూపాయికే హోల్ సేల్ లో లభిస్తుండడంతో ఒక పక్క రైతులు లబోదిబో మంటుండగా వినియోగదారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా ఉల్లి పండేది కర్నాటకలోనే. హుబ్లి, ధార్వాడ్, హవేరి, గడగ్, బాగల్ కోట్, బెల్గాం, దావణగెరె, చిత్రదుర్గలోనే హోల్ సేల్ మార్కెట్లలో వంద కిలోల ఉల్లి బస్తా కేవలం వంద రూపాయలకే లభిస్తోంది.

వారం క్రితం వరకు క్వింటాలు ఉల్లి 500 రూపాయలకు అమ్మింది. దారుణంగా ఉల్లి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఉల్లి అధిక దిగుబడి సాధించడంతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా అధికంగా దిగుమతి కావడంతో ధరలు దారుణంగా పడిపోయాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో గజ తుపాను కారణంగా ఆ రాష్ట్రానికి ఉల్లి ఎగుమతి వారం రోజు ల నుంచి నిలిచిపోవడం కూడా ధరల పతనానికి ఒక కారణంగా చెబుతున్నారు. కర్నాటక నుంచి తమిళనాడు, కేరళ, ఉత్తరాది రాష్ట్రాలకు ఉల్లి సరఫరా అవుతుంది. ఈ పరిస్థితులలో ఉల్లి రైతులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Onion wholesale prices down Rs 1/kg in Karnataka

Related Stories: