స్టేల చంద్రబాబు: కెటిఆర్

హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తదని కాంగ్రెస్ నేత జైరాంరమేష్  కు సిఎం కెసిఆర్ చెప్పరని మంత్రి కెటిఆర్ వివరించారు. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. అంబర్‌పేట్‌లో అడ్వకేట్ ఫర్ టిఆర్‌ఎస్ అనే  కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. దేశంలో ఎన్నో ఉద్యమాలను తాము అణచివేసామని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా అణచివేస్తామని జైరాం చెప్పడన్నారు.  హైకోర్టు విభజన జరగకపోవడానికి ఎపి సిఎం చంద్రబాబు నాయుడే […]

హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తదని కాంగ్రెస్ నేత జైరాంరమేష్  కు సిఎం కెసిఆర్ చెప్పరని మంత్రి కెటిఆర్ వివరించారు. అందుకే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. అంబర్‌పేట్‌లో అడ్వకేట్ ఫర్ టిఆర్‌ఎస్ అనే  కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. దేశంలో ఎన్నో ఉద్యమాలను తాము అణచివేసామని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా అణచివేస్తామని జైరాం చెప్పడన్నారు.  హైకోర్టు విభజన జరగకపోవడానికి ఎపి సిఎం చంద్రబాబు నాయుడే కారణమని విమర్శించారు. తనపై ఎలాంటి విచారణ వచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటు మారిందని దుయ్యబట్టారు. 2019 జనవరిలో మన హైకోర్టు మనకు వస్తదని వెల్లడించారు. 1956 నుంచి 2014 వరకు ఒక్క రంగారెడ్డి జిల్లా మాత్రమే ఏర్పడిందని, పరిపాలనా సౌలభ్యం కోసమే కెసిఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల్లో డ్రిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సిఎం కెసిఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షాలు కూటమి ఏర్పాటు చేశాయని కెటిఆర్ ధ్వజమెత్తారు. విపక్షాలు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని, నాలుగున్నరేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ వర్గంపైనా వివక్ష చూపలేదన్నారు. కులం, మతం ప్రాంతం పేరుతో విపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్‌లోని సీమాంధ్రులంతా టిఆర్‌ఎస్‌కే ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో జలమండలి దగ్గర తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, అన్ని వర్గాల అభివృద్దే టిఆర్‌ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒయు విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ వాడుకొని వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని, విద్యార్థి నేతలకు టికెట్లు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని ప్రశంసించారు. కోదండరాంను జెఎసి చైర్మన్‌గా చేసిందే కెసిఆరే అని తెలిపారు.

Telangana Elections: KTR Election Campaign

Telangana news

Related Stories: