మరో ఆప్ నేతపై కాల్పులు

చండీగఢ్: పంజాబ్ లో అమృత్ సర్ కు చెంది ఆప్ పార్టీ నేతపై దాడి జరిగింది. ఆప్ పార్టీకి చెందిన సీనియర్ నేత సురేష్ శర్మ తన షాపులో పని చేస్తుండగా దుండగులు అతి దగ్గరికి వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు […]

చండీగఢ్: పంజాబ్ లో అమృత్ సర్ కు చెంది ఆప్ పార్టీ నేతపై దాడి జరిగింది. ఆప్ పార్టీకి చెందిన సీనియర్ నేత సురేష్ శర్మ తన షాపులో పని చేస్తుండగా దుండగులు అతి దగ్గరికి వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అనిల్ కుమార్ అనే దుండగుడు కారంతో దాడి చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ కాళ్లకు నమష్కరించబోతున్నట్లుగా నటించి  కేజ్రీ కళ్ల జోడు లాగి కారం కొట్టినట్టు అక్కడి కెమెరాల్లో రికార్డ్  అయింది. పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

Related Stories: