రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

హరియాణా : హిసార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 9మంది గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాదు ఆ కారు మరో కారును ఢీకొంది. ఈ క్రమంలో రెండు కార్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి కింద పడ్డాయి. రెండు కార్ల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై […]

హరియాణా : హిసార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 9మంది గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాదు ఆ కారు మరో కారును ఢీకొంది. ఈ క్రమంలో రెండు కార్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి కింద పడ్డాయి. రెండు కార్ల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Five People died in Road Accident