టిఆర్‌ఎస్‌దే విజయం : కవిత

జగిత్యాల : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో బుధవారం ఆమె టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కమార్‌కు మద్ధతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారం కోసం అపవిత్ర పొత్తుతో వస్తున్న మహాకూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. సిఎం […]

జగిత్యాల : వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో బుధవారం ఆమె టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కమార్‌కు మద్ధతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారం కోసం అపవిత్ర పొత్తుతో వస్తున్న మహాకూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. సిఎం కెసిఆర్ నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ఆమె స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆమె టిఆర్‌ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కవిత ప్రచారం సందర్భంగా బైక్ ర్యాలీ తీశారు. మంగళ హారతులు, కోలాటలతో మహిళలు కవితకు బ్రహ్మరథం పట్టారు.

MP Kavitha Election Campaign in Jagtial

Related Stories: