రోడ్లు వేసుకోలేని వారు ప్రజలకేం చేస్తారు…

ఆదిలాబాద్: సొంత గ్రామాలకు రోడ్డు వేసుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏం చేస్తారని మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంటలో  జోగు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామ గ్రామాల రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. అన్ని చేతి వృతి కులాలకు పూర్యవైభవాన్ని తీసుకొచ్చామన్నారు. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని గుర్తించడం టిఆర్‌ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ గొప్పదనమని కొనియాడారు. ప్రభుత్వ […]

ఆదిలాబాద్: సొంత గ్రామాలకు రోడ్డు వేసుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏం చేస్తారని మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అనుకుంటలో  జోగు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గ్రామ గ్రామాల రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. అన్ని చేతి వృతి కులాలకు పూర్యవైభవాన్ని తీసుకొచ్చామన్నారు. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని గుర్తించడం టిఆర్‌ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ గొప్పదనమని కొనియాడారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తామని జోగు ధీమా వ్యక్తం చేశారు.  మంత్రి సమక్షంలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Telangana Elections: Jogu Ramanna Election Campaign

Telangana news

Related Stories: