కాంగ్రెస్ కు అఖిలేష్ సూచన

న్యూఢిల్లీ: ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చిన్న పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఇప్పటికీ ఉందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. తమ మిత్రపక్షం కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ మరోసారి స్నేహ హస్తం అందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 200లకు పైగా స్థానాలను హస్తం పార్టీ గెలుచుకునే చాన్స్ ఉందన్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో చేతులు కలిపితేనే అది సాధ్యమని […]

న్యూఢిల్లీ: ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చిన్న పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఇప్పటికీ ఉందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. తమ మిత్రపక్షం కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ మరోసారి స్నేహ హస్తం అందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 200లకు పైగా స్థానాలను హస్తం పార్టీ గెలుచుకునే చాన్స్ ఉందన్నారు. కాగా, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో చేతులు కలిపితేనే అది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికి కూడా సమయం మించిపోలేదని ఇప్పటికైనా ఇతర పార్టీలను కలుపుకుపోవాలన్నారు. ఎస్పి, బిఎస్పిలతో పాటు గోండ్వానా గణతంత్ర పార్టీని కూడా తమతో కలుపుకుంటే మధ్యప్రదేశ్ లో 200లకు పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ  కైవసం  ఖాయమని చెప్పారు. మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ను బిఎస్పి అధినేత్రి మాయావతి తీవ్రంగా విమర్శించారు. దిగ్విజయ్ వల్లే తాము కాంగ్రెస్ తో కలవలేకపోతున్నామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఛత్తీస్ ఘఢ్ ఎన్నికల్లో అజిత్ జోగికి చెందిన ఛత్తీస్ ఘఢ్ జనతా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేముందు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో పక్క మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ ఈ మేరకు వ్యాఖ్యనించారు.

Akhilesh Yadav Comment on Congress Party

telangana latest news

Related Stories: