గజ తుఫాను బాధితులకు రజనీ సాయం

చెన్నయ్ : గజ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాను బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ గజ తుఫాను బాధితులకు యాబై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరో సూర్య కుటుంబంతో పాటు జివి ప్రకాశ్, విజయ్‌సేతుపతిలు తుఫాను బాధితులకు విరాళాలు ఇచ్చారు. శివకార్తికేయన్ ఇరవై లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇందులో పది లక్షల నగదును సిఎం సహాయనిధికి అందజేశారు. మిగిలిన పది లక్షలను సహాయక […]

చెన్నయ్ : గజ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాను బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ గజ తుఫాను బాధితులకు యాబై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరో సూర్య కుటుంబంతో పాటు జివి ప్రకాశ్, విజయ్‌సేతుపతిలు తుఫాను బాధితులకు విరాళాలు ఇచ్చారు. శివకార్తికేయన్ ఇరవై లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇందులో పది లక్షల నగదును సిఎం సహాయనిధికి అందజేశారు. మిగిలిన పది లక్షలను సహాయక వస్తువుల రూపేనా అందజేశారు. లైకా సంస్థ కూడా రూ.1.01కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

Actor Rajini helps the Gaza Victims