సేమ్ టూ సేమ్

60చోట్ల ప్రత్యర్థులు వారే మన తెలంగాణ / హైదరాబాద్ : గత సాధారణ ఎన్నికల సమయంలో లేని ఒక ప్రత్యేకత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా అభ్యర్థుల్ని నిలబెట్టగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తుండడంతో ఈ రెండు పార్టీల మధ్య పోటీ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో నిర్దిష్టంగా ఆయా నియోజకవర్గాల్లో తలపడిన అభ్యర్థులే ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ప్రధాన […]

60చోట్ల ప్రత్యర్థులు వారే

మన తెలంగాణ / హైదరాబాద్ : గత సాధారణ ఎన్నికల సమయంలో లేని ఒక ప్రత్యేకత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వేర్వేరుగా అభ్యర్థుల్ని నిలబెట్టగా ఈసారి మాత్రం కూటమిగా పోటీ చేస్తుండడంతో ఈ రెండు పార్టీల మధ్య పోటీ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో నిర్దిష్టంగా ఆయా నియోజకవర్గాల్లో తలపడిన అభ్యర్థులే ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ప్రధాన ప్రత్యర్థులుగానూ ఉన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి పోటీచేస్తున్నందువల్ల చాలా చోట్ల సమీకరణాలు మారాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో దాదాపు సగం చోట్ల టిఆర్‌ఎస్, మహాకూటమి తరఫున గత ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులే ఈసారి కూడా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఈసారి టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తుండగా కొన్ని చోట్ల మాత్రం గతంలో టిఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులు ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. పార్టీలు మారినా అభ్యర్థులు, ప్రధాన పోటీ మాత్రం దాదాపు అరవై చోట్ల గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఉండబోతుంది.

మరికొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీచేసినవారు ఈసారి వేరే నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్న ప్రేమ్‌సాగర్‌రావు, కొండా సురేఖ లాంటివారు ఈసారి వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీలు మారినా, స్థానాలు మారినా సగం నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ పాత అభ్యర్థుల మధ్యనే ఉంటోంది. ఇందులో కొద్దిమంది అభ్యర్థులు విజేతలుగా ఉండగా మరికొద్దిమంది రెండవ స్థానంలో నిలిచినవారు ఉన్నారు. చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రస్తుతం టిఆర్‌ఎస్ తరఫున పోటీచేస్తున్న కాలె యాదయ్య గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అదే స్థానంలో గతంలో టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కెఎస్ రత్నం ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ తరఫున వేర్వేరు బి ఫాంలతో పోటీ చేసిన అభ్యర్థులు ఈసారి కూటమి తరఫున పోటీ చేస్తున్నందువల్ల వారి మధ్య పోటీ లేకుండాపోయింది. ఉదాహరణకు గజ్వేల్ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం తరఫున పోటీచేసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా ఆ స్థానంలో కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన నర్సారెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన గెలిచినవారిలో మెజారిటీ శాసనసభ్యులు ఆ తర్వాత అధికార టిఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే ఉంటోంది.

ఇలాంటి స్థానాల్లో అటు టిఆర్‌ఎస్ అభ్యర్థులు, ఇటు టిడిపి లేదా కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి పోటీచేసే అవకాశం రాలేదు. ఉదాహరణకు కుత్బుల్లాపూర్‌లో గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసిన వివేకానందగౌడ్ ఈసారి టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తుండగా అప్పుడు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన హన్మంత్‌రెడ్డికి ఈసారి పోటీ చేసే అవకాశం చేజారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ యధావిధిగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, బిజెపి తరఫున సంకినేని వెంకటేశ్వరరావుల మధ్య పోటీ నెలకొనింది. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన పటేల్ రమేశ్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌లో చేరడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ విధంగా నాల్గవ అభ్యర్థితో పోటీ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఈ నలుగురి మధ్యా రెండు వేల ఓట్ల మార్జిన్ మాత్రమే ఉంది.

గత ఎన్నికల్లో కల్వకుర్తిలో జరిగిన ముక్కోణపు పోటీలో టిఆర్‌ఎస్ తరఫున జైపాల్‌యాదవ్, కాంగ్రెస్ తరఫున వంశీచంద్‌రెడ్డి (విజేత), బిజెపికి చెందిన ఆచారి పోటీచేశారు. వనపర్తిలో టిఆర్‌ఎస్ తరఫున నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి (విజేత), తెలుగుదేశం తరఫున రావుల చంద్రశేఖరరెడ్డి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్, టిడిపి కూటమిగా ఏర్పడడంతో ఈసారి రావుల పోటీలో లేరు. గోషామహల్‌లో సైతం టిఆర్‌ఎస్ తరఫున ప్రేంసింగ్ రాథోడ్, కాంగ్రెస్ తరఫున ముఖేశ్‌గౌడ్, బిజెపి తరఫున రాజాసింగ్ (విజేత) పోటీ చేశారు. దుబ్బాకలో టిఆర్‌ఎస్ తరఫున సొలిపేట రామలింగారెడ్డి పోటీ చేయగా బిజెపి తరఫున రఘునందన్‌రావు పోటీ చేశారు. ఇప్పుడూ వీరి మధ్య పోటీ ఉంది. కూటమిలో భాగంగా ఈసారి ఈ స్థానంలో టిజెఎస్ తరఫున రాజ్‌కుమార్ పోటీచేస్తున్నారు. ఆంధోల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున సినీ నటుడు బాబూమోహన్ పోటీ చేసి గెలవగా కాంగ్రెస్ తరఫున దామోదర రాజనర్సింహ పోటీ చేశారు. ఈసారి బాబూమోహన్ బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మళ్ళీ వీరి మధ్యే పోటీ ఉంటోంది. చొప్పదండిలో గతంలో టిఆర్‌ఎస్ తరఫున బొడిగె శోభ పోటీ చేసి గెలిచినా ఈసారి టికెట్ రాకపోవడంతో బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన మేడపల్లి సత్యం ఈసారి కూటమి తరఫున (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లోనూ, ఇప్పుడూ ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులు వీరే 

Related Stories: