కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు శానవాస్ కన్నుమూత

తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి  అధ్యక్షుడు ఎంఐ శానవాస్ (67) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లివర్ సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేనంద్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎంపిగా పని చేశారు.  శానవాస్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాలా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ […]

తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి  అధ్యక్షుడు ఎంఐ శానవాస్ (67) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లివర్ సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేనంద్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎంపిగా పని చేశారు.  శానవాస్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాలా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.  బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొచ్చిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు వెల్లడించారు.

MI Shanavas Passes Away in Kerala

Telangana news