24న టిఆర్‌ఎస్ పూర్తిస్థాయి మేనిఫెస్టో

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో 42 పేజీలతో రూపుదిద్దుకున్నట్టు సమాచారం. పూర్తి మేనిఫెస్టోను ఈనెల 24వ తేదీన విడుదల చేయాలని కెసిఆర్ ముహూ ర్తం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే పూర్తి చేసిన ప్రణాళికకు కెసిఆర్ తుదిరూపు ఇచ్చారని, ప్రధానంగా దీనిని మూడు భాగాలుగా తీర్చిదిద్దారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కెసిఆర్ 6 సంఖ్య అచ్చిరావడంతో ఈనెల 24వ తేదీన దానిని విడుదల చేయాలని కెసిఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మలివిడత ప్రచారానికి […]

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో 42 పేజీలతో రూపుదిద్దుకున్నట్టు సమాచారం. పూర్తి మేనిఫెస్టోను ఈనెల 24వ తేదీన విడుదల చేయాలని కెసిఆర్ ముహూ ర్తం నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే పూర్తి చేసిన ప్రణాళికకు కెసిఆర్ తుదిరూపు ఇచ్చారని, ప్రధానంగా దీనిని మూడు భాగాలుగా తీర్చిదిద్దారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కెసిఆర్ 6 సంఖ్య అచ్చిరావడంతో ఈనెల 24వ తేదీన దానిని విడుదల చేయాలని కెసిఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మలివిడత ప్రచారానికి ముందే పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయాలనుకున్నా కొన్ని మార్పులు చేర్పులు ఉండడంతో ఆలస్యం జరిగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి భాగంలో నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, విపక్షాల అడ్డంకులు, ఎన్నికలకు ఎందుకు వెళుతున్న విషయాలను అందులో పొందుపరిచినట్టు సమాచారం.

రెండో భాగంలో నీటిపారుదల, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమం, డబుల్ బెడ్ రూం, ఇండ్లు, పారిశ్రామిక రంగం, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, క్రీడ లు, రవాణా, ధార్మికత, ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, పాత్రికేయులు, తెలంగాణ ప్రవాసులు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిన ట్టు తెలిసింది. మూడో భాగం లో కొత్త హామీలు ఉండనున్నట్టు తెలిసింది. ఈ హామీలు కూడా కనివినీ ఎరుగని రీతిలో ఉంటాయని, దీనివలన ప్రజల్లో టిఆర్‌ఎస్‌పై మరింత నమ్మకం కలుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేనిఫెస్టోకు ఉన్న ప్రాధాన్యత దృష్టా పలు రంగాల నిపుణులు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు దీనిపై గట్టి కసరత్తు చేశారు. ఈ కసరత్తులో భాగంగానే ప్రజాకర్షక హామీలకు తెరతీశారు. కొత్త హామీలతో ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లే అస్త్రాలను అందులో పొందుపరిచినట్టు సమాచారం. విడుదలకు మూడు రోజుల ముందుగానే మేనిఫెస్టోను ఈసీకి సమర్పించాల్సి ఉండడంతో 21వ తేదీన సమర్పించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈనెల 24 న ఎన్నికల ప్రచారంలో కెసిఆర్  పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

November 24th Release TRS Full manifesto

Telangana News

Related Stories: