పేదల జీవితాల్లో వెలుగులు నింపేది కెసిఆరే

 వైరా ప్రచార సభలో టిఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ మన తెలంగాణ / వైరా: ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్షంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆహ ర్నిషలు శ్రమించిన కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు పెద్దన్నగా ఉంటూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వైరా టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్‌లాల్ అన్నారు. మంగళవారం ఖమ్మం జి ల్లా వైరా మండలం నియోజకవర్గ పరిధిలోని వల్లాపురం, […]

 వైరా ప్రచార సభలో టిఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్

మన తెలంగాణ / వైరా: ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ప్రధాన లక్షంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆహ ర్నిషలు శ్రమించిన కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు పెద్దన్నగా ఉంటూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వైరా టిఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్‌లాల్ అన్నారు. మంగళవారం ఖమ్మం జి ల్లా వైరా మండలం నియోజకవర్గ పరిధిలోని వల్లాపురం, గొల్లపుడి, అష్టగుర్తి, రెబ్బవరం, కొండకొడిమ, ఖానాపురం, గన్నవరం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మదన్‌లాల్ ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ బ్రహ్మరధం పట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా అభివృద్ధి పధంలో ఉండాలని కు ల వృత్తులకు చేయుతనిస్తున్నారని అన్నారు. వారి జీవనోపాధిని మరింత పెం చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఉండాలని, కెసిఆర్ పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది రైతులకు అండగా నిలిచారని అ న్నారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో కంటి పరీక్షలతో పాటు అ వసరమైన వారికి కంటి ఆపరేషన్లు, కళ్లజోళ్లు పంపిణీ చేశారన్నారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు పంటల సాగే అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌లోకి రానున్నాయని ఆయకట్టు భూములన్ని సస్యశ్యామలం అవుతాయని తె లిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని విధాల ముందుంచేందుకు కో ట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఈ ప్రచారంలో మాచ్చ వెంకటేశ్వర్లు(బుజ్జి), కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ కో టయ్య, వైరా సొసైటీ అధ్యక్షులు తాతా రంగారావు,  తదితరులు ఉన్నారు.

TRS candidate Madanlal Election campaign in wyra

Telangana News

Related Stories: