ఎండుద్రాక్షతో మలబద్ధకం మాయం..

ఈ మధ్య చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  సాధారణంగా తల్లి పాలు తాగే  చిన్నారుల్లో మలబద్ధకం ఉండదు. కానీ డబ్బా పాలు తాగే పిల్లల్లో కొందరు బాధపడం చూస్తుంటాం. ఏడాది నిండిన పిల్లలకు వారికిచ్చే ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగించాలి. మలవిసర్జన కష్టంగా ఉండే ఏడాది నుంచి రెండేళ్ల లోపు పిల్లలు ఆ నొప్పికి భయపడి మలవిసర్జనని వాయిదా వేస్తారు. దాంతో సమస్య ఇంకా పెరుగుతుంది. ఏం చేయాలంటే.. డబ్బాపాలు […]

ఈ మధ్య చిన్నపిల్లల్లో మలబద్ధకం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  సాధారణంగా తల్లి పాలు తాగే  చిన్నారుల్లో మలబద్ధకం ఉండదు. కానీ డబ్బా పాలు తాగే పిల్లల్లో కొందరు బాధపడం చూస్తుంటాం. ఏడాది నిండిన పిల్లలకు వారికిచ్చే ఆహారంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగించాలి. మలవిసర్జన కష్టంగా ఉండే ఏడాది నుంచి రెండేళ్ల లోపు పిల్లలు ఆ నొప్పికి భయపడి మలవిసర్జనని వాయిదా వేస్తారు. దాంతో సమస్య ఇంకా పెరుగుతుంది.

ఏం చేయాలంటే..
డబ్బాపాలు తాగుతున్న పిల్లలకు.. అందులో కలిపే నీటి పరిమాణాన్ని పెంచాలి. అప్పటివరకూ వాడుతున్నది కాకుండా మరో కొత్త పాలపొడిని ప్రయత్నించి చూడాలి. రోజూ ఎండు ద్రాక్షని ఒకసారి గోరువెచ్చని నీటితో కడిగి, ఆ తరువాత మంచి నీళ్లల్లో నానబెట్టాలి. ఇవి బాగా నానాక మెత్తగా చేసి, నీళ్లతో కలపాలి. ఆరునెలల్లోపు పిల్లలకైతే ఈ నీటిని వడపోసి రెండేసి చెంచాల చొప్పున రోజులో రెండుసార్లు తాగించాలి. ఆరు నెలలు నిండిన పిల్లలకైతే వడపోయకుండా మూడు లేదా నాలుగు చెంచాల చొప్పున రెండు పూటలా తాగించాలి. అప్పుడు విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే పోషక విలువలూ పిల్లలకు అందుతాయి. పాపాయిని వెల్లకిలా పడుకోబెట్టి బొడ్డు కింద పొట్ట భాగంపై గోరువెచ్చని ఆముదాన్ని రాసి మృదువుగా మర్దన చేయాలి. గతంలో చంటి పిల్లలకు రోజూ పరగడుపున చిటికెడు ఆముదాన్ని నాలుకపై రాసేవారు. దీంతో మలబద్దకం సమస్య ఉండేది కాదు.
ప్రస్తుతం ఈ అలవాటు తగ్గింది. అయితే మలబద్ధకం ఉన్న చంటి పిల్లలకు వారి వయసును బట్టి గోరువెచ్చని నీళ్లల్లో పావు చెంచా ఆముదం కలిపి తాగిస్తే, తీవ్రంగా ఉన్న మలబద్ధకం తగ్గుముఖం పడుతుంది.
కూరగాయలూ, పండ్లు తప్పనిసరి…
ఏడాది నిండిన పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తే వాళ్లకి ఇచ్చే ఆహారంలో కాయగూరలూ, ఆకుకూరలు చేర్చి చూడండి. ఎక్కువగా మంచి నీళ్లూ తాగించాలి. పండిన అరటిపండు, బత్తాయి, కమలా పండ్లు తినిపిం చాలి. చిప్స్ వంటి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటే మాన్పించడం మంచిది. రెండు లేదా మూడు ఎండు ఖర్జూరాలను శుభ్రంగా కడిగి, రాత్రిపూట వేడి నీళ్లలో నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా చేసి గింజలను తీసేయాలి. ఈ ఖర్జూరం గుజ్జును నీళ్లతో కలిపి పిల్లలతో తాగించాలి. విరేచనం సాఫీగా కావ డమే కాదు, ఇందులోని ఇనుము, క్యాల్షియం పిల్ల లకు మేలు చేస్తాయి. ఎండు ఖర్జూరం ఓ టానిక్‌లా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు మేలు చేస్తుంది కాబట్టి ఎన్ని రోజులు ఇచ్చినా హాని ఉండదు. పిల్లల్ని చురుగ్గా ఉంచేలా చూడండి. ఎక్కువసేపు ఆటలు ఆడించాలి. దానివల్ల కూడా జీర్ణవ్యవస్థ పనితీరు మెరు గై… మలబద్ధకం సమస్య ఎదురుకాకుండా ఉంటుంది.

Constipation in young children

Telangana News