కాంగ్రెస్ పాలనలో కరెంటుకు కష్టాలే :కెసిఆర్

కామారెడ్డి: దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రపథంలో నిలిచిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గం కంటే ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి ఎక్కువ చెరువులు అభివృద్ధి చేసుకున్నరని..ఆ గౌరవం వారికే దక్కిందన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు రవీందర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సిఎం పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుందని చెప్పారు.మిషన్ భగీరథ ద్వారా […]

కామారెడ్డి: దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రపథంలో నిలిచిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గం కంటే ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి ఎక్కువ చెరువులు అభివృద్ధి చేసుకున్నరని..ఆ గౌరవం వారికే దక్కిందన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు రవీందర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సిఎం పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుందని చెప్పారు.మిషన్ భగీరథ ద్వారా ఎల్లారెడ్డిలో అన్ని గ్రామాలకు నీళ్లు చేరాయని, నల్లాల కలెక్షన్లు ఇచ్చే పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

గౌడ కులస్థులకు శాశ్వతంగా చెట్ల పన్ను రద్దయిపోయిందని…నాయీ బ్రాహ్మణ, రజక సోదరుల అభివృద్ధికి కూడా అనేక  కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయని తెలిపారు. గత కాంగ్రెస్, టిడిపి పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తదో?, ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పుడు కాలిపోతయో? తెలిసేదికాదని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆ భాదలు లేకుండా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతలేవని, కరెంట్ పోతలేదన్నారు. ఆడబిడ్డలను, ఒంటరి మహిళలను ఆదుకున్నామన్నారు. బిడి కార్మికులకు వెయ్యి రూపాయలు పించన్ ఇస్తున్నామని, మళ్లీ టిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ దారులందరికీ వెయ్యి పెన్షన్‌ను పెంచి 2,016 రూపాయలు అందజేస్త మన్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా రైతు బీమా తీసుకొచ్చామన్నారు. ఏ పైరవీ లేకుండా ఏ అధికారి వద్దకు పోకుండా వారి ఖాతాల్లో బీమా సొమ్ము పడేలా చర్యలు తీసుకుంటున్నామని  సిఎం కెసిఆర్ తెలిపారు.

CM KCR Speech at Kamareddy trs Praja Ashirvada sabha

Related Stories: