టిఆర్ఎస్‌కు ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా

హైదరాబాద్: చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఎంపి కొండా తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు.ఈ నేపథ్యంలో ఆయన టిఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గత […]

హైదరాబాద్: చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఎంపి కొండా తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు.ఈ నేపథ్యంలో ఆయన టిఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Related Stories: