ప్రపంచకప్ తొలి టికెట్ కొనుగోలు చేసిన‌ ఒడిశా సిఎం

భువనేశ్వర్: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్ కు ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 27న పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భువనేశ్వర్ కళింగ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా, ఈ ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీ తొలి టికెట్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. సెర్మనీ టికెట్ కోసం సిఎం రూ.500 చెల్లించి కొనుగోలు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హాకీ ఇండియా సిఇఒ ఎలినా […]

భువనేశ్వర్: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్ కు ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 27న పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భువనేశ్వర్ కళింగ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా, ఈ ప్రపంచకప్ ఓపెనింగ్ సెర్మనీ తొలి టికెట్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనుగోలు చేశారు. సెర్మనీ టికెట్ కోసం సిఎం రూ.500 చెల్లించి కొనుగోలు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హాకీ ఇండియా సిఇఒ ఎలినా నార్మన్ తొలి టికెట్ సిఎంకు అందజేశారు.

మంగళవారం నుంచి ఆన్ టికెట్ల అమ్మకాలు  ప్రారంభమయ్యాయని హాకీ ఇండియా తెలిపింది. ఆరంభోత్సవ కార్యక్రమాల్లో ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ మ్యాస్ట్రో ఎఆర్ రెహమాన్ తన సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయనతోపాటు ప్రముఖ బాలీవుడ్ తారలు ఈ సెర్మనీలో సందడి చేయనున్నట్లు సమాచారం. 18 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు  పాల్గొంటున్నాయి.

Hockey World Cup:Odisha cm buys 1st ticket

Related Stories: