సిక్కుల ఊచకోత కేసు : ఒకరికి ఉరి శిక్ష

న్యూఢిల్లీ: 1984 జరిగిన  సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ కోర్టు తొలిసారి ఓ దోషికి ఉరిశిక్ష విధించింది . యశ్‌పాల్ సింగ్ అనే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేసింది. నరేశ్ షెరావత్ అనే మరో వ్యక్తికి జీవితఖైదు విధించింది. ఇద్దరు సిక్కు వ్యక్తులను చంపిన కేసులో వీళ్లిద్దరూ దోషులుగా తేలడంతో కోర్టు వారికి  శిక్ష విధించింది. ఈ కేసు విచారణ జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇద్దరు దోషులకు ఉరి శిక్ష వేయాలని కోర్టును కోరింది. వారి దుశ్చర్య ఓ […]

న్యూఢిల్లీ: 1984 జరిగిన  సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ కోర్టు తొలిసారి ఓ దోషికి ఉరిశిక్ష విధించింది . యశ్‌పాల్ సింగ్ అనే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేసింది. నరేశ్ షెరావత్ అనే మరో వ్యక్తికి జీవితఖైదు విధించింది. ఇద్దరు సిక్కు వ్యక్తులను చంపిన కేసులో వీళ్లిద్దరూ దోషులుగా తేలడంతో కోర్టు వారికి  శిక్ష విధించింది. ఈ కేసు విచారణ జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇద్దరు దోషులకు ఉరి శిక్ష వేయాలని కోర్టును కోరింది. వారి దుశ్చర్య ఓ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సాగిన మారణహోమంలో భాగమని సిట్ కోర్టుకు తెలిపింది. ఇది అత్యంత అరుదైన కేసుగా సిట్ కోర్టుకు విన్నవించింది. దక్షిణ ఢిల్లీలో ఉండే మహిపాల్‌పూర్‌కు చెందిన హర్‌దేవ్ సింగ్, అవతార్ సింగ్ అనే వ్యక్తులను వీరు హత్య చేశారు. 2015లో ఏర్పడిన సిట్ ఈ సిక్కుల ఊచకోత కేసును తిరిగి తెరిచిన తర్వాత తొలిసారి ఈ ఇద్దరు వ్యక్తులు దోషులుగా తేల్చింది.

Related Stories: