‘నేను కలలు కన్న తెలంగాణ సాకారం కాబోతుంది’

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడినం, సిరిసిల్ల చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు తమ వెంట ఉందన్నారు. ఉద్యమ సమయంలో సిరిసిల్ల జెడ్ పి పీఠంపై గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రం కూడా కొంత ప్రతికూలంగానే వ్యవహారించదని కెసిఆర్ పేర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు అధిగమించి అందరూ గర్వించే స్థాయిలో నిలబడినమన్నారు. దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నామని, […]

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడినం, సిరిసిల్ల చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు తమ వెంట ఉందన్నారు. ఉద్యమ సమయంలో సిరిసిల్ల జెడ్ పి పీఠంపై గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రం కూడా కొంత ప్రతికూలంగానే వ్యవహారించదని కెసిఆర్ పేర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు అధిగమించి అందరూ గర్వించే స్థాయిలో నిలబడినమన్నారు. దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్నామని, రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని, విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, తాను కలలు కన్న తెలంగాణ సాకారం కాబోతుందన్నారు.

రైతన్నల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామని, రెండు వేల మందికి పథకం అందిందని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని కెసిఆర్ విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, నీరు, విద్యుత్ సమస్యలతో రైతన్నలు సతమతమయ్యారు. టిఆర్ఎస్ పాలనలో రైతుల సమస్యలను పరిష్కారించామని, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే తమ లక్ష్యమని కెసిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ పట్టుపడితే ఏదైనా మొండిగా పట్టుపడతారని చెప్పుకొచ్చారు. అది సాధించేవరకు పట్టువదలబోమన్నారు.

CM KCR To Address Public Meeting in Sircilla

Telangana Breaking News

Related Stories: