కేజ్రీవాల్‌పై కారంపొడితో దాడి

ఢిల్లీ : ఆప్ చీఫ్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం సాక్షాత్తు సచివాలయం వెలుపలో జరిగింది. ఈ దాడిలో కేజ్రీవాల్ కంటి అద్దాలు పగిలిపోయాయి. దాడి చేసిన వ్యక్తిని అనిల్‌శర్మగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేజ్రీవాల్‌పై దాడి జరగడం కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే. 2016 అక్టోబర్‌లో ఎబివిపి నాయకుడు ఒకరు రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఇంక్ చల్లి కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. […]

ఢిల్లీ : ఆప్ చీఫ్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం సాక్షాత్తు సచివాలయం వెలుపలో జరిగింది. ఈ దాడిలో కేజ్రీవాల్ కంటి అద్దాలు పగిలిపోయాయి. దాడి చేసిన వ్యక్తిని అనిల్‌శర్మగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేజ్రీవాల్‌పై దాడి జరగడం కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే. 2016 అక్టోబర్‌లో ఎబివిపి నాయకుడు ఒకరు రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఇంక్ చల్లి కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. అదేవిధంగా 2016 జనవరిలో ఢిల్లీ స్టేడియం వద్ద ఆప్ తిరుగుబాటు నేత ఒకరు కేజ్రీవాల్‌పై ఇంక్ చల్లాడు. 2014లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వారణాసిలో కేజ్రీవాల్ ఇదే రకమైన దాడి జరిగింది. వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం వెలుపల కేజ్రీవాల్ కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు.

Attack with chilli Powder on Kejriwal

Related Stories: