రెండేళ్లలో సిద్దిపేటకు రైలు సౌకర్యం: కెసిఆర్

సిద్దిపేట: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. మరోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో సిద్దిపేటకు రైలు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే రైతులను అన్నీ విధాల అదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సిఎం అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా, పైసా ఖర్చుకాకుండా రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇంటికి చేరిన విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నది […]

సిద్దిపేట: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. మరోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో సిద్దిపేటకు రైలు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే రైతులను అన్నీ విధాల అదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సిఎం అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా, పైసా ఖర్చుకాకుండా రైతులకు కొత్త పాసుపుస్తకాలు ఇంటికి చేరిన విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులందరికీ అప్పులే అని తెలిపారు. స్వరాష్ట్రంలో రైతులకు అప్పులు ఉండకూడదని, రైతు బ్యాంకు ఖాతాల్లో నిల్వలు ఉండాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు అందిస్తున్న రైతుబంధు పథకం పెట్టుబడి రాయితీని  ఏడాదికి రూ. 10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటలు దళారీల పాలుకాకుండా డిమాండ్ కు అమ్ముడుపోవాలని అన్నారు. పంటలను మహిళా సంఘాలే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లో ఆహారశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఐకెపి ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.

మహిళా సంఘాలకు ఐకెపి ఉద్యోగులు అండగా ఉండాలని సూచించారు. రైతులు పండించే మిరప పంటను కూడా మహిళా సంఘాలే కొనుగోలు చేస్తాయన్నారు. రేషన్ డీలర్లు నాణ్యమైన సరకులను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ప్రస్తుతం ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా కల్తీయేనని, కల్తీలేని సరకులను అందించేందుకు ఆహార శుద్ధీకేంద్రాలు తోడ్పతాయన్నారు. అంగన్వాడీలు, హోంగార్డులకు అన్నీ రాష్ట్రల కంటే తెలంగాణలోనే ఎక్కువ జీతభత్యాలు అందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. అవినీతి, కుంభకోణాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంటే… సంక్షేమ పథకాలు పెంచినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

CM KCR Speech in Praja Ashirvada Sabha at Siddipet

Telangana Breaking News

Related Stories: